Delhi Liquor policy: సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్‌కు బెయిల్, ఐదు రోజుల ఈడీ కస్టడీ
ABN, First Publish Date - 2022-11-14T17:51:12+05:30
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్-చార్జి విజయ్ నాయర్, వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లికి ఢిల్లీ కోర్టు..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor policy) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కమ్యూనికేషన్ ఇన్-చార్జి విజయ్ నాయర్ (Vijay Nair), వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లికి ఢిల్లీ కోర్టు సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇదే కోర్టు లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ దర్యాప్తునకు సంబంధించి 5 రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి వీరిని పంపింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహాయకుడైన నాయర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం అరెస్టు చేసింది. ఈ కేసులో సీబీఐ కస్టడీకి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణకు ముందే ఈయనను ఈడీ అదుపులోనికి తీసుకుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో నాయర్, బోయినపల్లిని సీబీఐ అరెస్టు చేయడంతో అప్పట్నించీ వారు జైలులో ఉన్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఈ ఇద్దరి పాత్ర ఉందని ఈడీ అభియోగంగా ఉంది. మనీ లాండరింగ్ కోణం నుంచి వీరిపై ఈడీ విచారణ సాగిస్తోంది.
Updated Date - 2022-11-14T17:54:24+05:30 IST