ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramdev Baba : మహిళలపై రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు... ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం...

ABN, First Publish Date - 2022-11-26T17:11:35+05:30

యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తనలాగా

Baba Ramdev, Amrita Fadnavis
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తనలాగా ఏమీ ధరించకపోయినా మహిళలు బాగుంటారని అనడంతో ఆయనపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన దేశంలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని కోరింది. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినపుడు వేదికపై ఉన్నవారిలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ కూడా ఉన్నారు.

మహారాష్ట్రలోని థానేలో శుక్రవారం యోగా శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు చీరలు కూడా తమ వెంట తీసుకొచ్చారు. కానీ వెంటవెంటనే కార్యక్రమాలు జరగడంతో సల్వార్, కమీజ్ దుస్తులను మార్చి, తాము తీసుకొచ్చిన చీరలను ధరించడానికి అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ, ‘‘మీరు చీరల్లో బాగుంటారు, అమృత గారి మాదిరిగా, సల్వార్ సూట్లలో బాగుంటారు, నాలాగా ఏమీ ధరించకపోయినా మీరు బాగుంటారు’’ అన్నారు.

రామ్‌దేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేసినపుడు ఆ వేదికపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) సతీమణి అమృత ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా ఉన్నారు.

రామ్‌దేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ (Swati Maliwal) ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సతీమణి సమక్షంలో స్వామి రామ్‌దేవ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు అమర్యాదకరంగా ఉన్నాయని, ఖండించదగినవని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు మహిళలందరినీ బాధించాయన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు బాబా రామ్‌దేవ్ దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు.

శివసేన (ఉద్ధవ్ బాలా సాహెబ్ థాకరే) నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ, బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై అమృత ఫడ్నవీస్ ఎందుకు నిరసన తెలియజేయలేదని ప్రశ్నించారు.

Updated Date - 2022-11-26T17:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising