ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Russia : పుతిన్‌ను గద్దె దించి, చంపాలని అత్యంత సన్నిహితుడి పిలుపు?

ABN, First Publish Date - 2022-11-12T20:23:10+05:30

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని డిమాండ్ చేస్తున్న రష్యన్ మేధావులు,

Vladimir Putin
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin)కు అత్యంత సన్నిహితుడు అలగ్జాండర్ డుగిన్ (Alexander Dugin) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లోని ఖెరసోన్‌పై దాడిలో రష్యా అవమానకరంగా ఓడిపోవడంతో పుతిన్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఇంకాస్త ముందుకెళ్ళి పుతిన్‌ను చంపాలనే సంకేతాలను కూడా ఇచ్చారు. అయితే టెలిగ్రామ్‌లో ఇచ్చిన ఈ సందేశాన్ని ఆయన కాసేపటికే తొలగించారని బ్రిటిష్ మీడియా తెలిపింది.

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని డిమాండ్ చేస్తున్న రష్యన్ మేధావులు, ఉన్నత స్థాయి నేతల సంఖ్య పెరుగుతోందని బ్రిటిష్ మీడియా చెప్తోంది. ఇటువంటివారిలో డుగిన్ ఒకరని చెప్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్ విఫలమయ్యారని డుగిన్ టెలిగ్రామ్‌ చాటింగ్‌లో చెప్పినట్లు పేర్కొంది. డుగిన్ ఇచ్చిన సందేశంలో, జేమ్స్ ఫ్రేజర్ రాసిన కథలోని ఓ సన్నివేశాన్ని ప్రస్తావించారని తెలిపింది. అనావృష్టి సమయంలో వర్షం కురిపించలేదనే కారణంతో రాజును చంపేశారని ఈ కథ చెప్తోందని పేర్కొంది. ‘‘పాలకుడికి మనం సంపూర్ణ అధికారాలను ఇచ్చాం, ఆయన మనల్ని, ప్రజలను, దేశాన్ని కాపాడుతున్నారు. దీని కోసమే ఆయన తనను తాను సుడిగుండంలోకి నెట్టుకుంటే, లేదా సామాజిక న్యాయంపై ఉమ్మి వేస్తే, అది సరైనది కాదు, ఆయన తనను తాను మాత్రమే కాపాడుకుంటే, సరైనది కాదు’’ అని డుగిన్ తన చాట్‌లో తెలిపారని తెలిపింది.

ఖెరసోన్‌ను రష్యా అప్పగించేసినందుకు ప్రతి రష్యన్ బాధతో, ఆగ్రహంతో పళ్ళు నూరాలని డుగిన్ చెప్పారని తెలిపింది. నిజమైన రష్యన్ ఇప్పుడు బాధతో పళ్ళు నూరుతారని, తీవ్రంగా విచారిస్తారని అన్నారని పేర్కొంది. ఖెరసోన్ విషయంలో తలకిందులు కానివారు రష్యన్లు కాదన్నారని, ఉక్రెయిన్‌పై యుద్ధంలో విజయం సాధించడంలో విఫలమైనందుకు పుతిన్‌ను రష్యన్ సైనిక ఉన్నతాధికారులు విమర్శిస్తున్నారని తెలిపింది.

Updated Date - 2022-11-12T20:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising