Earthquake: ఉత్తరాఖండ్‌ను వణికించిన భూకంపం
ABN, First Publish Date - 2022-12-28T05:30:12+05:30
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది...
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది.(Earthquake) బుధవారం తెల్లవారుజామున 2.19 గంటలకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో(Uttarkashi) భూమి కంపించింది.(Uttarakhand) భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న జనం ఉలిక్కిపడి లేచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(National Centre for Seismology) వెల్లడించింది.(Latest news) 5కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని అధికారులు చెప్పారు. గతంలోనూ పలుసార్లు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూమి కంపించింది. తరచూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూమి కంపిస్తుండటంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2022-12-28T05:31:26+05:30 IST