ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hemant Soren: సీఎం విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈడీ

ABN, First Publish Date - 2022-11-15T16:08:54+05:30

జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈడీ విచారణను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్ (Illegal mining) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈడీ విచారణను ఒకరోజు ముందుకు జరపాలని ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తిరస్కరించింది. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని సోరెన్‌కు పంపిన సమన్లలో ఈడీ ఆదేశించగా, తనకు ఆరోజు రాజకీయ, అధికారిక కార్యక్రమాలు ఉన్నందున 16వ తేదీన విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని ఆయన ఈడీని కోరారు. అయితే, ఇన్విస్టిగేషన్ సంబంధించిన కారణాలను ప్రస్తావిస్తూ ఆయన విజ్ఞప్తిని ఈడీ తోసిపుచ్చింది.

కాగా, దీనికి ముందు నవంబర్ 3న విచారణకు హాజరుకావాలని ఆయనకు ఈడీ సమన్లు పంపింది. అధికారిక కార్యక్రమాలను ఉటంకిస్తూ ఆరోజు విచారణకు సోరెన్ హాజరు కాలేదు. మూడు వారాల పాటు సమన్లు వాయిదా వేయాలని ఈడీని కోరారు. మనీలాండరింగ్ నిబంధల కింద సోరెన్ స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని ఈడీ భావిస్తోంది. ఇదే కేసులో సోరెన్ రాజకీయ సహాయకుడు పంకజ్ మిశ్రా, మరో ఇద్దరు స్థానికులు బచ్చు యాదవ్, ప్రేమ్ ప్రకాష్‌లను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఈ కేసులో రూ.1,000 కోట్లకు పైగా విలువచేసే అక్రమ మైనింగ్ జరిగినట్టు ఈడీ చెబుతోంది.

Updated Date - 2022-11-15T16:08:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising