ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Farooq Abdullah: ఓటర్లను కాళ్లు విరగ్గొడతామన్నారు..ఆర్మీపై సంచలన ఆరోపణ

ABN, First Publish Date - 2022-12-05T19:57:06+05:30

భారత ఆర్మీపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన ఆరోపణలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: భారత ఆర్మీ (Indian Army)పై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) సంచలన ఆరోపణలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్‌ (NC)గా సోమవారంనాడు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన ఫరూక్ అబ్దుల్లా...ఆ వెంటనే ఆర్మీపై తీవ్ర ఆరోపణ చేశారు. జమ్మూకశ్మీర్‌లో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ 1996 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రతా బలగాలు జోక్యం చేసుకున్నాయని ఆరోపించారు. భద్రతా బలగాలు, ఆర్మీ, ప్రభుత్వ యంత్రాంగం జోక్యంతో జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఎలాంటి రిగ్గింగ్ జరిగినా దానిపై తాను ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు.

''నేను సీఎంగా ఉన్నప్పుడు (1996) ఎన్నికలు జరుగుతున్న దోడాలోని ఓ గ్రామానికి వెళ్లాను. ఓటింగ్ మిషన్లు ఉంచిన ఆర్మీ క్యాంపులో ఒక్క మనిషి కూడా ఓటింగ్ కోసం కనిపించలేదు. జనం ఎందుకు లేరని అడిగినప్పుడు, ఓటు వేయడానికి ఎవరూ రాలేదని వారు (బలగాలు) చెప్పారు. ఆ వెంటనే జనం వద్దకు వెళ్లి ఎందుకు ఓటు వేయడానికి వెళ్లలేదని అడిగాను. కాళ్లు విరగ్గొడతామని ఆర్మీ బెదిరించినట్టు చెప్పారు'' అని నాటి సంగతులను ఫరూక్ అబ్దుల్లా వివరించారు.

జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని, ఎవరికి ఓటు వెయ్యాలనేది ప్రజలు నిర్ణయానికే విడిచిపెట్టాలని భద్రతా బలగాలకు సూచించారు. ''ప్రతిఘటన అంటూ వస్తే అది మీరు అదుపు చేయలేరు'' అని తీవ్రస్వరంతో అన్నారు. అలాంటి పరిస్థితులంటూ తలెత్తితే (రిగ్గింగ్ జరిగితే) ఆందోళన చేపడతామని అన్నారు. ''మా జీవితాలు త్యాగం చేయడానికి సిద్ధమవుతాం. దీనిపై మొదట ఆందోళనకు దిగేది కూడా ఫరూక్ అబ్దుల్లానే'' అని ఆయన అన్నారు.

ఎన్‌సీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక

శ్రీనగర్‌లోని నేషనల్ కాన్ఫెరెన్స్ (ఎన్‌సీ) ప్రధాన కార్యాలయమైన 'నవా ఇ సుభా'లో సోమవారంనాడు ఎన్‌సీ అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఫరూక్ అబ్దుల్లా తిరిగి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫరూక్ అబ్దుల్లా గత నెలలో ఎన్‌సీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.

ఆ పని తప్పే...

పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన సందర్భంగా పార్టీ డెలిగేషన్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, 2018 ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ తీసుకున్న నిర్ణయం తప్పేనని అన్నారు. ఇక నుంచి రాబోయే ఏ ఎన్నికలను బాయ్‌కాట్ చేయమని, తప్పనిసరిగా పోటీచేసి, గెలుపొందుతామని అన్నారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకూ ఎన్నికల్లో పోటీ చేయనని ఒమర్ అబ్దుల్లా (ఫరూక్ కుమారుడు) ప్రకటించడంపై మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడి ఆదేశాలే ఎవరికైనా శిరోధార్యమని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన పోటీ చేయాలన్నదే తన ఆదేశమని అన్నారు. పోరాడదలచుకున్నప్పుడు అంతరూ బరిలోకి దిగి పోరాడాల్సిందేనని ఫరూక్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-05T20:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising