ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former Chief Minister: ఆ మూడింటిలో.. ఒక చోట పోటీ చేస్తా...

ABN, First Publish Date - 2022-11-19T11:42:13+05:30

మూడు నియోజకవర్గాలు ఎంచుకున్నా.. ఫైనల్‌గా ఒక చోటు నుంచి మాత్రమే పోటీ చేస్తానని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Siddaramaiah) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రతిపక్షనేత సిద్దరామయ్య

బెంగళూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మూడు నియోజకవర్గాలు ఎంచుకున్నా.. ఫైనల్‌గా ఒక చోటు నుంచి మాత్రమే పోటీ చేస్తానని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Siddaramaiah) తెలిపారు. శుక్రవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే డిమాండ్‌ ఉందన్నారు. తాను మాత్రం కోలారు, బాదామి, వరుణ నియోజక వర్గాలను ఎంపిక చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ మూడింటిలో చివరకు ఒక చోటు నుంచి మాత్రమే పోటీ చేస్తానన్నారు. ఎక్కడి నుంచి అనేది పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందన్నారు. ఓటమి భయంతో సర్వేలు జరుపుతున్నారనే విమర్శలపై అడిగిన ప్రశ్నకు సమాధామిస్తూ సర్వేలు చేస్తే తప్పు ఏమిటన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు చోట్ల పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. అప్పట్లో సర్వేలు చేయకుండానే నరేంద్రమోదీ పోటీ చేశారా అన్నారు. తాను కానీ, తమ పార్టీ కానీ ఎక్కడా సర్వే చేయించలేదన్నారు. ఎన్నికల వేళ సర్వేలు సాధారణమే అన్నారు. కాగా సిద్దరామయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుంటే పార్టీకి మేలు జరుగుతుందనే మాజీ మంత్రి సంతోష్‏లాడ్‌ వ్యాఖ్యలపై స్పందించారు. తాను అతడి వ్యాఖ్యలను పరిగణిస్తానన్నారు. అంతిమ నిర్ణయం పార్టీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-19T12:16:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising