ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dera Follower Murder case: వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ అరెస్టు

ABN, First Publish Date - 2022-11-20T18:13:44+05:30

డేరా సచ్చా సౌదా ఫాలోయిర్ (ప్రదీప్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో చాలాకాలంగా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: డేరా సచ్చా సౌదా ఫాలోయిర్ (Dera Sacha Sauda Follower) ప్రదీప్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో చాలాకాలంగా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ (Gangster) రాజ్ హుడా (Raj Hooda)ను పంజాబ్‌ (Punjab) యాంటీ-గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రాజస్థాన్‌లో జైపూర్‌లో ఆదివారంనాడు వలవేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. ప్రదీప్ సింగ్‌‌ను హత్య చేసిన ఆరుగురు నిందితుల్లో రాజ్ హుడా ఒకరు. ఈ ఆరుగురిలో నలుగురు షూటర్లు హర్యానాకు చెందిన వారు కాగా, ఇద్దరు పంజాబ్‌కు చెందిన వారు. వీరిలో ముగ్గురు నిందితులను ఇటీవల కస్టడీలోకి తీసుకున్నారు.

కాగా, పంజాబ్ టాస్క్‌ఫోర్స్ కొద్దికాలంగా రాజ్ హుడా ఆచూకీ కోసం వెదుకుతోంది. అతను తెలివిగా ఒక చోట నుంచి ఒక చోటకు మారుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంతకుముందు పంజాబ్‌లోనూ, ఆ తర్వాత హర్యానాలోనూ, ఒకసారి హిమాచల్ ప్రదేశ్‌లోనూ అతను కనిపించినట్టు చెబుతున్నారు. ఆదివారం ఉదయం రాజస్థాన్ పోలీసుల సహకారంతో హుడాను పంజాబ్ పోలీసులు జైపూర్‌లో అరెస్టు చేశారు. తొలుత హుడాను లొంగిపోవాల్సిందిగా పోలీసుల హెచ్చరికలు చేయగా, హుడా ఎదురు కాల్పులకు తెగబడ్డాడు. కొద్దిసేపు కాల్పుల అనంతరం పంజాబ్ పోలీస్ ఏజీటీఎస్ టీమ్ అతన్ని అరెస్టు చేసింది.

ముగ్గురు నిందితుల అరెస్టు..

ఈ కేసుకు చెందిన ముగ్గురు నిందితులను గత నవంబర్ 11న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. పంజాబ్‌లోని పాటియాలా జిల్లా బక్షవాలా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాడులు జరిపి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 26 ఏళ్ల యువకుడితో పాటు ఇద్దరు జువనైల్స్ ఉన్నారు. కెనడా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఆదేశాల మేరకు వీరు క్రిమినల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నట్టు పోలీసులు గుర్తించారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లా‌లో కొద్దికాలం క్రితం ప్రదీప్ సింగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. కొట్కాపురలోని తన దుకాణం తెరిచేందుకు వచ్చిన ప్రదీప్‌పై మోటారువాహనాలపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రదీప్ గన్‌మెన్ సహా ముగ్గురు గాయపడ్డారు.

Updated Date - 2022-11-20T18:13:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising