XBB Variantపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ
ABN, First Publish Date - 2022-12-22T13:31:14+05:30
కొవిడ్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రారంభమైందని.. ప్రాణాంతకమని.. దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
XBB Variant : కొవిడ్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రారంభమైందని.. ప్రాణాంతకమని.. దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారికి దగ్గు, జ్వరం వంటివేమీ ఉండవని.. కీళ్ల నొప్పులు, తలనొప్పి, న్యూమోనియా వంటివి పరిమితంగా ఉంటాయని సదరు న్యూస్ సారాంశం. దీని మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్న న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై నేడు కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. కోవిడ్ XBB వేరియంట్‌పై వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చింది. పలు రకాల లక్షణాలు ఉన్నాయని.. వ్యాప్తి ఎక్కువగా చెందుతోంది అంటూ వస్తున్న మెసేజ్‌లను నమ్మొద్దని సూచించింది. XXB వేరియంట్ వచ్చిందన్న వార్తలు.. తప్పుడు వార్తలుగా నిర్ధారించింది. ప్రజల్లో అలజడి సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.
Updated Date - 2022-12-22T13:31:16+05:30 IST