ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hero Vishal: ప్రజాసేవకు రాజకీయాలు అవసరం లేదు

ABN, First Publish Date - 2022-12-20T10:23:21+05:30

ప్రజాసేవ చేయాలంటే ఎన్నికల్లో పోటీచేయాల్సిన అవసరంలేదని సినీహీరో విశాల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- హీరో విశాల్‌

తిరుపతి(విద్య),డిసెంబరు 19: ప్రజాసేవ చేయాలంటే ఎన్నికల్లో పోటీచేయాల్సిన అవసరంలేదని సినీహీరో విశాల్‌(Cinehero Vishal) పేర్కొన్నారు. తాను హీరోగా నటించిన లాఠీ చిత్రం ఈనెల 22న విడుదల కానున్న సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సోమవారం తిరుపతి(Tirupati)లోని పలు కళాశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినీ హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌ అభిమానినని, అవకాశం వస్తే పవన్‌ కళ్యాణ్‌తో కలసి మల్టీస్టారర్‌ చేసేందుకు సిద్ధమన్నారు. తాను సినిమా హీరోగా ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నానని, ప్రజలకు సేవచేసే ప్రతి ఒక్కరూ రాజకీయనాయకులేనని చెప్పారు.

ప్రభుత్వాలకు మద్దతివ్వకుంటే ఉద్యోగం ఉండదు: మోహన్‌బాబు

రాజకీయపరంగా చూస్తే రాష్ర్టాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ పాలకులకు పోలీసులు మద్దతు పలకాలని, లేనిపక్షంలో ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని ప్రముఖ నటుడు మోహన్‌బాబు పేర్కొన్నారు.. లాఠీ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గత ఎనిమిదేళ్లుగా ఏ కార్యక్రమానికీ హాజరుకాని తాను విశాల్‌ ఫోన్‌ చేయడంతో వచ్చానని తెలిపారు.

Updated Date - 2022-12-20T10:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising