ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Home Minister: సైబర్‌ పోలీస్ స్టేషన్లను పెంచుతాం

ABN, First Publish Date - 2022-12-27T10:53:12+05:30

రాష్ట్రంలో 31 జిల్లాల్లో సైబర్‌ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర హమీ

బళ్లారి(బెంగళూరు), డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 31 జిల్లాల్లో సైబర్‌ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర(State Home Minister Araga Gyanendra) తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉండే సైబర్‌ పోలీస్టేషన్లకు తోడు మరిన్ని చోట్ల అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు. బెళగావి విధానసౌధలో జరుగుతున్న శీతాకాల సమావేశంలో సోమవారం ప్రశోత్తరాల సమయంలో సభ్యులు పీఆర్‌ రమేష్‌, టీఏ శరవణ మా ట్లాడారు. రాష్ట్రంలో సైబర్‌ నేరాలు బాగా పెరిగిపోయాయని, సామాన్యులు మోస పోతున్నారని వివరించారు. ఇందుకు హోంశాఖ మంత్రి బదులిచ్చారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సైబర్‌ పోలీస్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, సైబర్‌ నేరగాళ్లను గుర్తించేందుకు సీఐడీ విభాగంలో ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేయడం తదితర కారణాలతో సుమారు రూ. 70 కోట్లు నగదును ఖాతాదారులు మోసపోయునట్లు సైబర్‌ పోలీసులు గుర్తించారని ఇందులో కొంత నగదును రికవరీ కూడా చేశారన్నారు. బ్యాంకులో నగదు పోయిన వెంటనే ఖాతాదారులు సైబర్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోపు సైబర్‌ దొంగల ఖాతా నుంచి డబ్బులు తిరిగి పోగొట్టుకున్న వారి ఖాతాలోకి జమ అయ్యేలా చేస్తామన్నారు.

Updated Date - 2022-12-27T10:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising