Indian Navy Chief Hari Kumar: చైనా నౌకల కదలికలపై నిఘా పెట్టాం
ABN, First Publish Date - 2022-12-03T22:15:42+05:30
న్యూఢిల్లీ: హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకల కదలికలను, ఇతర పరిణామాలను భారత నావికాదళం ఎప్పటికప్పుడు గమనిస్తోందని, అన్నింటిపై నిఘా పెట్టామని
న్యూఢిల్లీ: హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకల కదలికలను, ఇతర పరిణామాలను భారత నావికాదళం ఎప్పటికప్పుడు గమనిస్తోందని, అన్నింటిపై నిఘా పెట్టామని నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రస్తుతం 60 అదనపు బలగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. భారత ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తామని నేవీ వీక్‌లో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. హిందూ మహాసముద్రంలో చైనా నిఘా నౌకల కదలికల నేపథ్యంలో హరికుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. 2047 నాటికి భారత నావికాదళం ఆత్మనిర్భర్ అవుతుందని దేశ రక్షణకు సంబంధించి సొంత పరిష్కరాలు కనుగొంటామని హరికుమార్ చెప్పారు.
Updated Date - 2022-12-03T22:16:29+05:30 IST