ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చదువుకున్న కాలేజీకి రూ.100 కోట్ల విరాళం

ABN, First Publish Date - 2022-04-06T01:24:43+05:30

గంగ్వాల్ ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థి. తాను చదువుకున్న కాలేజీని మరింత ఉన్నతంగా చూడాలని, రాబోయే తరాలకు మరింత నాణ్యమైన విద్యను అందించాలనే కారణంతో ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారని సమాచారం. వాస్తవానికి ఐఐటీ ఖరగ్‌‌పూర్‌కు పూర్వ విద్యార్థుల నుంచి ఇలా విరాళాలు అందడం కొత్తేం కాదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్: ఉన్న ఊరికి కన్న తల్లికి ఏదైనా చేయాలంటారు. ఊరికి, తల్లికి పాఠశాల కూడా ఏమాత్రం తీసిపోదు. వ్యక్తులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో పాఠశాలల పాత్ర ఎనలేనిది. అలాంటి పాఠశాలకు ఏదైనా చేయడం అంటే.. రాబోయే తరాలకు మేలు చేయడమే. ఇలాంటి ఆలోచనతోనే తాను చదువుకున్న కాలేజీని మరింత ఉన్నతంగా చూడాలనుకున్న ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్ ఏకంగా 100 కోట్ల రూపాయల విరాళంతో ముందుకు వచ్చారు. ఈ నిధులతో క్యాంపర్ ఆవరణలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నారు. దీనికి గంగ్వాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అని పేరు పెట్టనున్నారట.


గంగ్వాల్ ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థి. తాను చదువుకున్న కాలేజీని మరింత ఉన్నతంగా చూడాలని, రాబోయే తరాలకు మరింత నాణ్యమైన విద్యను అందించాలనే కారణంతో ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారని సమాచారం. వాస్తవానికి ఐఐటీ ఖరగ్‌‌పూర్‌కు పూర్వ విద్యార్థుల నుంచి ఇలా విరాళాలు అందడం కొత్తేం కాదు. కానీ, గంగ్వాల్ ఇచ్చిన విరాళం భారీ మొత్తంలో ఉండడం గమనార్హం. ఐఐటీ కాన్పూర్‌లో ఇంజనీరింగ్‌కి సంబంధించిన వసతులు పుష్కలంగానే ఉన్నాయి. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా మెడికల్ ఇంజనీరింగ్‌పై కాలేజీ యాజమాన్యం దృష్టి సారించింది. దీని కోసం ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికంటే ముందే పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు.

Updated Date - 2022-04-06T01:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising