ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిఆంధ్రులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

ABN, First Publish Date - 2022-12-20T10:35:24+05:30

రాష్ట్రవ్యాప్తంగా ఆదిఆంధ్రులు, అరుంధతీయులు, పారిశుధ్య కార్మికులు నివసిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టామ్స్‌ నేత గొల్లపల్లి

- క్రోంపేటలో మతసామరస్యం చాటిన క్రిస్మస్‌ వేడుకలు

ప్యారీస్‌(చెన్నై), డిసెంబరు 19: రాష్ట్రవ్యాప్తంగా ఆదిఆంధ్రులు, అరుంధతీయులు, పారిశుధ్య కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని తమిళనాడు ఆదిఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్‌) వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేలు(Gollapally Israel) కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. క్రోంపేట తెలుగు బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్‌-2022 వేడుకలు ఆదివారం పాస్టర్‌ రెవ.జి.మోజస్‌ నేతృత్వంలో సంఘ పెద్దలు అశోక్‌కుమార్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా గొల్లపల్లి ఇశ్రాయేలు, పల్లావరం ఎమ్మెల్యే కరుణానిధి(MLA Karunanidhi), జడ్జీలు ఎస్‌.వనంగాముడి, డా.ఏకేఎన్‌ వైద్యనాధన్‌, పల్లావరం జోన్‌ చైర్మన్‌ జోసఫ్‌ అన్నాదురై తదితరులు పాల్గొన్నారు. యూత్‌ విభాగం క్రీస్తు జననం, యేసుక్రీస్తు అద్భుతాలు తెలిపే నాటికలు ప్రదర్శించగా, చిన్నారులు పాటలకు నృత్యం చేసారు. కార్యక్రమంలో గొల్లపల్లి ఇశ్రాయేలు మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో ఆదిఆంధ్రులు, అరుంధతీయులు, పారిశుధ్య కార్మికులు అధికంగా ఉన్నారని, అయితే పలు ప్రాంతాల్లో శ్మశానవాటిక, మౌలిక సదుపాయాలు లేక వారు ఇబ్బంది పాలవుతున్నారని ప్రభుత్వం పరిశీలించి ఈ వసతులు కల్పించాలని ఆయన కోరారు. ప్రత్యేక ఆహ్వానితులుగా చల్లగాలి ఆరోన్‌, కనుమూరి జోనా, సంఘ అధ్యక్షుడు ఎండీ సుందరం, కార్యదర్శి జి.మనోహర్‌, ట్రెజరర్‌ ఎ.వినోద్‌, వై.ప్రభాకర్‌, బి.మోజస్‌, మహిళలు, క్రోంపేట తెలుగు సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-20T10:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising