‘స్టార్టప్’.. అంతర్జాతీయ సదస్సు.. బెంగళూరులో రేపటి నుంచే..
ABN, First Publish Date - 2022-06-02T01:10:10+05:30
స్టార్టప్‌ల కోసం బెంగళూరు అంతర్జాతీయ సదస్సు రేపటి(గురువారం) నుంచి బెంగళూరులో ప్రారంభం కానుంది.
బెంగళూరు : స్టార్టప్‌ల కోసం బెంగళూరు అంతర్జాతీయ సదస్సు రేపటి(గురువారం) నుంచి బెంగళూరులో ప్రారంభం కానుంది. IGIC యొక్క ప్రారంభ ఎడిషన్ కర్నాటక డిజిటల్ ఎకానమీ మిషన్ వ్యవస్థాపక స్పాన్సర్‌లు కాటమరాన్ వెంచర్స్, టాటా డిజిటల్‌ల సహకారంతో వ్యూహాత్మక సలహా సంస్థ స్మాడ్జా & స్మాడ్జా నిర్వహించనున్నాయి. ప్రారంభ సమావేశంలో భారత్, సింగపూర్, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, అమెరికా, జపాన్, కొరియా, జర్మనీ తదితర దేశాల నుండి 80 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. రెండు రోజుల సదస్సులో 22 సెషన్‌లు జరగనున్నాయి. ఇందులో 40 మందికి పైగా అంతర్జాతీయ వక్తలు వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు మరియు టాప్ వెంచర్ క్యాపిటలిస్ట్‌లకు సంబంధించిన ఇతివృత్తాలపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇతర ప్రముఖలలో కర్నాటక ఐటీ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి, టెక్నాలజీ ఫార్చ్యూనర్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పాల్ సఫో తదితరులున్నారు.
Updated Date - 2022-06-02T01:10:10+05:30 IST