ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షారిక్‌కు ఐసిస్‌ లింకులు

ABN, First Publish Date - 2022-11-22T03:32:48+05:30

కుక్కర్‌ బాంబు పేలుడులో కీలక నిందితుడు మొహమ్మద్‌ షారిక్‌(24)కు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసి్‌సతో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఏడీజీపీ అలోక్‌ కుమార్‌ సోమవారం మంగళూరులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వయంగా బాంబు తయారీ పేలుడు సామగ్రి స్వాధీనం

బెంగళూరు, చెన్నై, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): కుక్కర్‌ బాంబు పేలుడులో కీలక నిందితుడు మొహమ్మద్‌ షారిక్‌(24)కు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసి్‌సతో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఏడీజీపీ అలోక్‌ కుమార్‌ సోమవారం మంగళూరులో మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. కర్ణాటకలోని మంగళూరులో శనివారం రాత్రి ఆటోలో కుక్కర్‌ బాంబు పేలిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు మైసూరుకు చెందిన ఇద్దరు, మంగళూరు, ఊటీకి చెందిన ఒక్కొక్కరిని అరెస్టు చేసినట్టు ఏడీజీపీ తెలిపారు. కుక్కర్‌ బాంబును షారిక్‌ స్వయంగా తయారు చేశాడని, అది తక్కువ సామర్థ్యం కలిగినదని, సరిగా అమర్చకపోవడం వల్లే పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. బీకాం చదివిన షారిక్‌ ఆన్‌లైన్‌ ద్వారా బాంబుల తయారీ నేర్చుకున్నాడన్నారు. షారిక్‌తోపాటు అరాఫత్‌ అలీ, సవదత్‌ అలీ, మదీర్‌ అహ్మద్‌.. సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. మిగిలిన వారికోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని చెప్పారు. మంగళూరు, శివమొగ్గ జిల్లాల్లో షారిక్‌ నివసిస్తున్న అద్దె ఇళ్లలో తనిఖీలు జరిపి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బెంగళూరులోని సుద్దగుంటేపాల్యకు చెందిన అబ్దుల్‌ మతాన్‌ తాహా, తీర్థహళ్లికి చెందిన అరాఫత్‌ అలీ సూచనల ప్రకారం షారిక్‌ పని చేస్తున్నాడని, తాహాపై ఎన్‌ఐఏ 5 లక్షల రివార్డు ఉందని చెప్పారు. అలాగే షారిక్‌కు సిమ్‌కార్డు కొనిచ్చిన ఊటీకి చెందిన టీచర్‌ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. షారిక్‌ సెప్టెంబరులో కోయంబత్తూరులోని సింగానల్లూరు వద్ద బస చేశాడని, ఆ సమయంలో నీలగిరి జిల్లా తుమ్మనట్టి ప్రాంతానికి చెందిన ప్రైవేటు స్కూల్‌ టీచర్‌ సురేంద్రన్‌(28)తో పరిచయం ఏర్పడిందని విచారణలో వెల్లడైంది. అదేవిధంగా నిందితుడితో లింకులు ఉన్నాయనే అనుమానంతో అసోం యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. శివమొగ్గ మత ఘర్షణల్లోనూ షారిక్‌కు పాత్ర ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.

Updated Date - 2022-11-22T03:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising