ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mamata Banerjee: జై శ్రీరాం నినాదాలు.. మమత అలక

ABN, First Publish Date - 2022-12-31T04:44:14+05:30

తల్లి హీరాబెన్‌ అంత్యక్రియలు నిర్వహించి.. వెంటనే బెంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోదీకి.. కాస్త విశ్రాంతి తీసుకోవాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వే ప్రాజెక్టు శంకుస్థాపన వేదిక ఎక్కకుండా నిరసన

ప్రధాని తెరపైకి వచ్చాక శాంతించిన బెంగాల్‌ సీఎం

కోల్‌కతా, డిసెంబరు 30: తల్లి హీరాబెన్‌ అంత్యక్రియలు నిర్వహించి.. వెంటనే బెంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోదీకి.. కాస్త విశ్రాంతి తీసుకోవాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సూచించారు. శుక్రవారం బెంగాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు గుజరాత్‌ రాజ్‌ భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరైన ఆయనతో ఆమె కాసేపు మాట్లాడారు. క్లుప్తంగా ప్రసంగించారు. ‘అమ్మ మరణానికి మీకెలా సంతాపం తెలియజేయాలో తెలియడం లేదు. మీ అమ్మ మాకూ అమ్మే. వ్యక్తిగతంగా ఇది మీకు విషాదదినం. అమ్మ చనిపోయినా అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా హాజరైనందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి విశ్రాంతి తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు. వాస్తవానికి అంతకుముందు ఈ కార్యక్రమం సందర్భంగా వివాదం తలెత్తింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు జైశ్రీరాం అంటూ నినదించడంతో ఆమె అలకబూనారు. వేదికపై కూర్చునేందుకు నిరాకరించి కిందే ఉండిపోయారు. మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెరపై ప్రత్యక్షమయ్యాక కాస్త శాంతించి ప్రసంగం చేశారు. ఈ అభివృద్ధి పనులు తన కలగా పేర్కొన్నారు. జోకా నుంచి తరతల వరకు రైలును ప్రారంభించడం, ఇతర రైల్వే ప్రాజెక్టులు చేపట్టడం తనకు ఆనందంగా కలిగిస్తున్నాయని తెలిపారు. మమత అలకపై రైల్వే మంత్రి మాట్లాడుతూ.. ‘ఆమెను ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా ఆహ్వానించాం. కొందరు నినాదాలు చేస్తుంటారు. వాటిని పట్టించుకుంటే ఎలా’ అని వ్యాఖ్యానించారు.

రైల్వేలో భారీ పెట్టుబడులు

రైల్వేపై రికార్డుస్థాయిలో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. రైల్వే వ్యవస్థను ఆధునికీకరించేందుకు, మౌలిక వసతులు పెంచేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హౌరా-న్యూ జల్‌పాయ్‌గురి స్టేషన్ల మధ్య కొత్తగా ప్రవేశ పెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌స(దేశంలో 7వది)ను జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా నాలుగు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

Updated Date - 2022-12-31T07:09:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising