కర్ణాటక : ఖురాన్ చదివి రథోత్సవ ప్రారంభానికి అనుమతి
ABN, First Publish Date - 2022-04-15T21:48:35+05:30
కర్ణాటకలోని బేలూరులో ఉన్న చెన్నకేశవ దేవాలయంలో రథోత్సవాన్ని
బెంగళూరు : కర్ణాటకలోని బేలూరులో ఉన్న చెన్నకేశవ దేవాలయంలో రథోత్సవాన్ని ప్రారంభించడానికి ముందు ఖురాన్ నుంచి కొన్ని వచనాలను చదవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కొనసాగుతోంది. ఏటా జరిగే ఈ రథోత్సవాలు రెండు రోజులపాటు జరుగుతాయి. ఈ సంవత్సరం బుధవారం ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. రథోత్సవం ప్రారంభమవడానికి ముందు ఓ మౌల్వీ ఖురాన్‌లోని కొన్ని వచనాలను చదువుతారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. ముస్లిం వ్యాపారులు దుకాణాలను ఏర్పాటుచేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో 15 మంది ముస్లిం వ్యాపారులు ఇక్కడ దుకాణాలను తెరిచారు.
Updated Date - 2022-04-15T21:48:35+05:30 IST