Nathuram Godse: శౌర్యదివస్‌గా నాథూరాం గాడ్సే వర్థంతి వేడుక
ABN, First Publish Date - 2022-11-16T06:31:07+05:30
మహాత్మాగాంధీ చంపిన హంతకుడు నాథూరాం గాడ్సే వర్థంతి జరిపిన కర్ణిసేన కొత్త వివాదం రేపింది....
ముంబయి(మహారాష్ట్ర): మహాత్మాగాంధీ చంపిన హంతకుడు నాథూరాం గాడ్సే వర్థంతి జరిపిన కర్ణిసేన కొత్త వివాదం రేపింది.మహారాష్ట్రలోని (Maharastra)పన్వేల్ నగరంలో కర్ణి సేన(Karni Sena) మంగళవారం నాథూరామ్ గాడ్సే(Nathuram Godse) వర్ధంతిని(death anniversary)శౌర్య దివస్‌గా(Shourya Diwas) పాటించింది.మహాత్మా గాంధీ హంతకుడైన నాథూరామ్ గాడ్సే వర్ధంతిని శౌర్య దివస్‌గా కర్ణి సేన నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
‘‘నాథూరామ్ గాడ్సే అమర్ రహే (నాధూరామ్ గాడ్సే లాంగ్ లివ్),నాథూరామ్ గాడ్సే జిందాబాద్’’ అంటూ కర్ణిసేన సభ్యులు నినాదాలు చేయడం వీడియోలో కనిపించింది. కర్ణి సేన కార్యకర్తలు కూడా గాడ్సేకు పూలతో హారతులు సమర్పించారు. కర్ణిసేన సభ్యులు, మహిళలు బారులు తీరి గాడ్సేకు పూలు జల్లి నివాళులు అర్పించారు. అనంతరం హిందూధర్మం కోసం పోరాడిని గాడ్సే అమరుడని వక్తలు పేర్కొన్నారు.
Updated Date - 2022-11-16T06:31:08+05:30 IST