Bihar:బీహార్లో జేడీ(యూ) ఇంట్లో మద్యం లభ్యం
ABN, First Publish Date - 2022-12-21T06:34:01+05:30
బీహార్ రాష్ట్రంలోని ఛప్రాలో జేడీ(యూ) నేత ఇంట్లో మద్యం లభించడం సంచలనం....
ఛప్రా(బీహార్): బీహార్ రాష్ట్రంలోని ఛప్రాలో జేడీ(యూ) నేత ఇంట్లో మద్యం లభించడం సంచలనం రేపింది.(Liquor)జేడీయూ రాజకీయ నాయకుడు సొంత ఇంట్లో దేశీయ, విదేశీ బ్రాండ్ల మద్యం కనుగొన్నారు.ఛప్రా పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త బృందం మర్హౌరాలోని జేడీ(యు) (JDU leader)నాయకుడి ఇంటి నుంచి మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. కామేశ్వర్ జేడీ(యు) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు.సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో ఇటీవల రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 70 మందికి పైగా మరణించారు. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందో బీహార్ పోలీసులు ఇంకా కనిపెట్టలేకపోయారు. ‘‘మద్యం తాగే వారు చనిపోతారు కాబట్టి పరిహారం ఇవ్వం’’అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.
Updated Date - 2022-12-21T06:34:03+05:30 IST