ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌కు సహకరించండి

ABN, First Publish Date - 2022-01-02T13:37:15+05:30

రాష్ట్రంలో ఒమైక్రాన్‌ నిరోధానికి తమ ప్రభుత్వం తాజాగా విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన ఓ వీడియో సందేశాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                          - రాష్ట్ర ప్రజలకు సీఎం స్టాలిన్‌ పిలుపు


చెన్నై: రాష్ట్రంలో ఒమైక్రాన్‌ నిరోధానికి తమ ప్రభుత్వం తాజాగా విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన ఓ వీడియో సందేశాన్ని వెలువరించారు. కరోనా వైరస్‌ గత సంవత్సరం పాలకులకు, ప్రజలకు ఎన్నో పాఠాలు నేర్పిందని, కొత్త సంవత్సరంలో పాత కష్టాలకు ప్రజలు దూరంగా ఉండాలనే తలంపుతోనే ఒమైక్రాన్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అటు కరోనా కేసులు పెరగకుండా, ఇటు ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు మంత్రులు, ఆరోగ్యశాఖ ఉన్నతాదికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సమష్టిగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించడం వల్ల వైరస్‌ మృతుల సంఖ్యను బాగా తగ్గించగలిగామని, ప్రస్తుతం రూపాంతరం చెందిన వైరస్‌ను కట్టడి చేయ డానికి రోగనిర్ధారణ శిబిరాలను పెంచేందుకు ఉత్తర్వులిచ్చానని తెలిపారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి వైద్యపరీక్షలు జరుపుతున్నామని, బాధితులకు చికిత్స అందించేందుకు ఆక్సిజన్‌ సదుపాయంతో కూడిన ప్రత్యేక వార్డులు, మందులు తదితర సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఒమైక్రాన్‌ వైరస్‌పై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అదే సమయంలో వైరస్‌ నిరోధక నిబంధనలను పాటించాలన్న విషయాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా మాస్కులు ధరించటం, భౌతికదూరాన్ని పాటించడం, తరచూ శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రపరచటం వంటి నిబంధనలను తూచ తప్పకుండా పాటించి ప్రభుత్వానికి సహకరించాలని స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా మెరీనా తీరంలో వున్న తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, డీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై సమాధులకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. 

Updated Date - 2022-01-02T13:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising