ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాలేగావ్‌ పేలుడు కేసు.. ఆ స్కూటర్‌ ప్రజ్ఞాసింగ్‌దే

ABN, First Publish Date - 2022-08-04T10:37:46+05:30

మాలేగావ్‌ పేలుడు కేసులో.. సంఘటన జరిగిన ప్రదేశంలో పేలుడు పదార్థాల ఆనవాళ్లతో లభించిన ఎల్‌ఎంఎల్‌ వెస్పా స్కూటర్‌ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌దేనని ఫోరెన్సిక్‌ నిపుణుడు స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫోరెన్సిక్‌ నిపుణుడి వెల్లడి

ముంబై, ఆగస్టు 3: మాలేగావ్‌ పేలుడు కేసులో.. సంఘటన జరిగిన ప్రదేశంలో పేలుడు పదార్థాల ఆనవాళ్లతో లభించిన ఎల్‌ఎంఎల్‌ వెస్పా స్కూటర్‌ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌దేనని ఫోరెన్సిక్‌ నిపుణుడు స్పష్టం చేశారు. 2008 సెప్టెంబరు 29 నాటి ఈ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 100 మందికిపైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో  261వ సాక్షిగా ఉన్న ఓ ఫోరెన్సిక్‌ నిపుణుడు.. ముంబైలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో బుధవారం ఈ మేరకు వాంగ్మూలమిచ్చారు. ‘‘పేలుడు జరిగిన ప్రదేశంలో ఓ ఎల్‌ఎంఎల్‌ వెస్పా స్కూటర్‌ శకలాలను సీజ్‌ చేశాం. ఆ వాహనం ప్రజ్ఞాసింగ్‌ పేరిటే రిజిస్టర్‌ అయ్యి ఉంది’’ అని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఆయన సహాయ రసాయన విశ్లేషకుడిగా పనిచేశారు. ‘‘మాలేగావ్‌ పేలుడుకు ఉపయోగించిన బాంబులను అమ్మోనియం నైట్రేట్‌తో తయారు చేశారు. నేను పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు.. తీవ్రంగా ధ్వంసమైన ఎల్‌ఎంఎల్‌ వెస్పా స్కూటర్‌ శకలాలను గుర్తించాను. ఆ శకలాలను సేకరించి, రసాయన పరీక్షలు నిర్వహించగా.. స్కూటర్‌పైనే పేలుడు పదార్థాల ఆనవాళ్లు దొరికాయి. ఈ పేలుడు జరపడానికి ముందు.. ఆ స్కూటర్‌ ఇంజన్‌ నంబర్‌ను చెరిపేశారు. ఆ తర్వాత ఫోరెన్సిక్‌ విశ్లేషణలో వాటిని గుర్తించాం’’ అని ఆయన కోర్టుకు వివరించారు. 

Updated Date - 2022-08-04T10:37:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising