ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

All Party Meet: కీలక సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

ABN, First Publish Date - 2022-12-04T21:27:11+05:30

బీజేపీతో ఘర్షణ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చని సమాచారం.

All Party Meet
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జీ 20 కూటమి దేశాల అధ్యక్ష బాధ్యతలు డిసెంబర్ ఒకటిన ఇండొనేషియా నుంచి అధికారికంగా స్వీకరించిన భారత్ దేశవ్యాప్తంగా ఏడాది పాటు అనేక ప్రాంతాల్లో విశేష కార్యక్రమాలు నిర్వహించనుంది. అయితే ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనే విషయంలో సలహాలు, సూచనలు స్వీకరించేందుకు అన్ని పార్టీల అధ్యక్షులతో కేంద్రం సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ అఖిల పక్ష సమావేశానికి ఆయా పార్టీల అధ్యక్షులే హాజరుకావాలనే నిబంధన ఉండటంతో ప్రతినిధులను పంపడానికి అవకాశం లేదు. బీజేపీతో ఘర్షణ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చని సమాచారం. ఢిల్లీ మద్యం స్కామ్‌లో కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడం అలాగే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ ద్వారా నోటీసులు ఇవ్వడంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సంబంధాలు ఢీ అంటే ఢీ అనేలా మారాయి. రెండు పార్టీల మధ్య అసలు పొసగడం లేదు. దీంతో కేంద్రం సోమవారం నిర్వహించబోయే సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొడతారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరౌతారని తెలిసింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశానికి హాజరుకానున్నారు.

మరోవైపు బీజేపీతో ఘర్షణ ఉన్నా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి హాజరౌతారని సమాచారం. అనారోగ్యంతో విదేశాలకు వెళ్లిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ హాజరుపై స్పష్టత రాలేదు. బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,కేంద్ర మంత్రులు సమావేశంలో ఉంటారు.

Updated Date - 2022-12-04T21:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising