ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Parliament : ప్రపంచంలో కోవిడ్ పరిస్థితిని గమనిస్తున్నాం : కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2022-12-22T15:19:51+05:30

కొత్త కోవిడ్-19 వేరియంట్లను నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటుకు తెలిపింది.

Mansukh Mandaviya
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కొత్త కోవిడ్-19 వేరియంట్లను నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటుకు తెలిపింది. చైనాలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) పార్లమెంటు ఉభయ సభల్లోనూ మాట్లాడుతూ, కోవిడ్ వ్యాప్తి నిరోధం కోసం తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు తెలిపారు. మాస్క్ ధరించాలనే నిబంధనను విధించాలని, జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని చెప్పినట్లు తెలిపారు.

‘‘గ్లోబల్ కోవిడ్ పరిస్థితిపై నిశితంగా దృష్టి పెట్టాం. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త కోవిడ్-19 వేరియంట్‌ను సకాలంలో గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని రాష్ట్రాలకు చెప్పాం’’ అని మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు. కోవిడ్-19 వైరస్ నిరంతరం క్రమంగా వృద్ధి చెందుతోందనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ మహమ్మారిని నిభాయించడంలో (Manage చేయడంలో) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చురుగ్గా వ్యవహరిస్తోందన్నారు. నేరుగా సంబంధాలు ఉన్నవారిలో ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ఈ వ్యాధిపై పోరాటం కోసం రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 220 కోట్ల కోవిడ్ టీకా మోతాదులను (vaccine doses)ను ఇచ్చినట్లు తెలిపారు. కొద్ది రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, అయితే భారత దేశంలో వాటి సంఖ్య తగ్గుతోందని చెప్పారు. చైనాలో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటాన్ని మనం చూస్తున్నామన్నారు. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికుల రాండమ్ ఆర్టీ-పీసీఆర్ (RT-PCR) శాంప్లింగ్ ప్రారంభించినట్లు చెప్పారు.

Updated Date - 2022-12-22T15:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising