ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Metro Phase III: మెట్రో మూడో దశకు ఆర్థిక శాఖ ఆమోదం

ABN, First Publish Date - 2022-11-05T11:50:02+05:30

‘నమ్మ మెట్రో’ మూడోదశ ప్రాజెక్టుకు రాష్ట్ర ఆర్థికశాఖ(State Finance Department) ఆమోదముద్ర వేసింది. మెట్రో మూడోదశ పథకం కోసం రూ.16,368 కోట్లు ఖర్చు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అంచనా ఖర్చు రూ.16,368 కోట్లు

బెంగళూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘నమ్మ మెట్రో’ మూడోదశ ప్రాజెక్టుకు రాష్ట్ర ఆర్థికశాఖ(State Finance Department) ఆమోదముద్ర వేసింది. మెట్రో మూడోదశ పథకం కోసం రూ.16,368 కోట్లు ఖర్చు చేయనున్నారు. బీఎంఆర్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంజుమ్‌ పర్వేజ్‌ ఈ మేరకు శుక్రవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. నగర పశ్చిమ భాగంలోని అవుటర్‌ రింగ్‌రోడ్డులో కెంపాపుర నుంచి జేపీనగర్‌ 4వ స్టేజ్‌ వరకు 32.16 కిలోమీటర్ల మేరకు, మాగడి రోడ్డు(Magadi Road)లో హొసహళ్లి మెట్రో స్టేషన్‌ నుంచి కడబగెరె వరకు 12.82 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. మూడోదశ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 60 శాతాన్ని రుణాల ద్వారా సమీకరించుకోనుండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలా 20 శాతం భరిస్తాయి. పనులు ప్రారంభమైనప్పటి నుంచి మూడోదశ మెట్రో మార్గం పూర్తి కావడానికి ఐదేళ్లు సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ నగరాభివృద్ధిశాఖ అనుమతులు దక్కడంతో కేంద్రానికి తుది ప్రతిపాదనలు పంపామని పర్వేజ్‌ వివరించారు. 32.16 కిలోమీటర్ల మెట్రో మార్గంలో 22 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. కాగా మూడోదశ ప్రాజెక్టు కోసం సుంకదకట్టె ప్రాంతంలో 40 ఎకరాల్లో తాత్కాలికంగా డిపోను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన వివరించారు.

Updated Date - 2022-11-05T11:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising