Jayaraman: సంతకాల సేకరణ ద్వారా సీఎంకు గుణపాఠం
ABN, First Publish Date - 2022-09-16T16:42:03+05:30
సంతకాల సేకరణ ద్వారా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు గుణపాఠం చెబుతామని అన్నాడీఎంకే నేత ఎమ్మెల్యే పొల్లాచ్చి జయరామన్(Jayaraman)
- పొల్లాచ్చి జయరామన్
పెరంబూర్(చెన్నై), సెప్టెంబరు 15: సంతకాల సేకరణ ద్వారా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు గుణపాఠం చెబుతామని అన్నాడీఎంకే నేత ఎమ్మెల్యే పొల్లాచ్చి జయరామన్(Jayaraman) తెలిపారు. తిరుప్పూర్‌లో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేలాగా డీఎంకే అధ్యక్షుడు కుటుంబంతో సహా రాత్రికి రాత్రే పారిపోయే కాలం వస్తుందని, కరోనా నుంచి కోలుకున్న ప్రజలను డీఎంకే ప్రభుత్వం(DMK Govt) ఆస్తి, విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమం చేపడతామని ఆయన తెలిపారు.
Updated Date - 2022-09-16T16:42:03+05:30 IST