ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Namaj Row : కర్ణాటక పాఠశాలలో నమాజ్ వివాదం

ABN, First Publish Date - 2022-11-16T18:40:12+05:30

కర్ణాటకలోని ఓ పాఠశాలలో విద్యార్థుల చేత నమాజ్ చేయించినట్లు బయటపడటంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది

Karnataka School
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళూరు : కర్ణాటకలోని ఓ పాఠశాలలో విద్యార్థుల చేత నమాజ్ చేయించినట్లు బయటపడటంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. హిందూ సంఘాలు ధర్నా చేయడంతో ఆ పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పింది. సమాజంలో శాంతి, సామరస్యాలు, సమానత్వం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ప్రార్థన చేయించినట్లు ఓ టీచర్ చెప్పారు. అయితే అజాన్ వినిపించడం పొరపాటేనని అంగీకరించారు.

ఉడుపి జిల్లా, కుందపూర్ తాలూకా, శంకరనారాయణ పట్టణంలో మదర్ థెరీసా మెమోరియల్ స్కూల్ ఉంది. ఈ పాఠశాలలో సోమవారం ఆటల పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అజాన్‌ను లౌడ్‌స్పీకర్‌లో వినిపించి, విద్యార్థుల చేత నమాజ్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాఠశాల వద్ద ధర్నా నిర్వహించాయి. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం దిగి వచ్చింది. అజాన్ వినిపించడం పొరపాటేనని అంగీకరించి, క్షమాపణ చెప్పింది.

మరొక వీడియోలో ఆ పాఠశాల టీచర్ ఒకరు మాట్లాడుతూ, అజాన్ వినిపించడం పొరపాటేనని అంగీకరించారు. సమాజంలో శాంతి, సామరస్యాలు, సమానత్వం కోసం ప్రార్థన చేయించినట్లు తెలిపారు. ఈ పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా మంగళవారం కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. హిందూ జనజాగృతి సమితి నేత మోహన్ గౌడ మాట్లాడుతూ, నమాజ్ చేయాలని హిందూ విద్యార్థులను నిర్బంధించడం అన్యాయమని చెప్పారు. ఈ పాఠశాల గతంలో హిందూ విద్యార్థులు బొట్టు పెట్టుకోవడాన్ని, గాజులు, పట్టీలు ధరించడాన్ని నిషేధించిందని తెలిపారు. కర్ణాటక విద్యా చట్టానికి వ్యతిరేకంగా ఈ పాఠశాల ఈ నిర్ణయం తీసుకుందన్నారు. జాతీయ బాలల హక్కుల కమిషన్, రాష్ట్ర విద్యా శాఖలకు తాను ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

Updated Date - 2022-11-16T18:40:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising