ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi Government: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి!

ABN, First Publish Date - 2022-12-15T16:10:47+05:30

జమిలి ఎన్నికలే మేలని కేంద్ర ప్రభుత్వం మరోసారి అభిప్రాయపడింది.

Modi Government
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలే మేలని కేంద్ర ప్రభుత్వం (Central Government ) మరోసారి అభిప్రాయపడింది. రాజ్యసభలో సభ్యుల ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) జవాబిచ్చారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయని తెలిపారు. 1968, 69లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దుకావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగిందని రిజుజు చెప్పారు. విడివిడిగా ఎన్నికల నిర్వహణతో బడ్జెట్ పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిపాలనలో సుస్థిరత కోసం జమిలి ఎన్నికలే మేలంటూ లా కమిషన్ తన 170వ నివేదికలోనూ సూచించిందని కేంద్రం తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. అనేక మంది మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణపై కొన్ని పార్టీల నేతల్లో ఇప్పటికే అపోహలు, ఆందోళనలున్నాయి. వారి ఆందోళనలను తొలగించేందుకు కేంద్రం మరింత కసరత్తు చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మరింత చైతన్యం తీసుకురావాల్సి ఉంటుందని రాజకీయ పండితులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-12-15T16:35:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising