NH-7: ఎన్‌హెచ్-7లో అత్యాధునిక ట్రాఫిక్ వ్యవస్థ
ABN, First Publish Date - 2022-11-19T08:59:38+05:30
మదురై నుంచి కన్నియాకుమారి(Madurai to Kanniyakumari) జాతీయ రహదారి ఎన్‌హెచ్7లో అత్యాధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఏటీఎం)ను ఏర్పాటు చేశారు. ఈ రహ
మదురై(చెన్నై), నవంబరు 18: మదురై నుంచి కన్నియాకుమారి(Madurai to Kanniyakumari) జాతీయ రహదారి ఎన్‌హెచ్7లో అత్యాధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఏటీఎం)ను ఏర్పాటు చేశారు. ఈ రహదారి నిర్వహణ పర్యవేక్షిస్తున్న మదురై కన్నియాకుమారి టోల్‌వే లిమిటెడ్ (ఎంకేటీఎల్), కన్నియాకుమారి ఎట్టుర్‌వట్టుం టోల్‌వే లిమిటెడ్ (కేఈటీఎల్)సంయుక్తంగా అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటుచేశాయి. ఈ వ్యవస్థ 116.5 కిలోమీటర్ల పరిధి కలిగిన ఎన్‌హెచ్-7 టూ లేన్ రహదారిని కవర్ చేస్తుంది. ఈ మార్గం మదురై, కన్నియాకుమారి వంటి కీలక నగరాలను కలుపుతుంది. ఎంకేటీల్ స్ట్రెచ్‌లో ప్రారంభించిన ఏటీఎంలను ఇంటెలిజెంట్ నెట్‌వర్క్ కెమెరాలను వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ (వీఐడీఎస్)తో అనుసంధానించడం జరిగిందని ఎంకేటీఎల్, కేఈటీల్‌లు సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
Updated Date - 2022-11-19T08:59:41+05:30 IST