ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nirav Modi : త్వరలో భారత్‌కు నీరవ్‌ మోదీ?

ABN, First Publish Date - 2022-11-10T05:29:36+05:30

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)కి రూ. 13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి లండన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని బ్రిటన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లైన్‌ క్లియర్‌ చేసిన బ్రిటన్‌ హైకోర్టు

లండన్‌, నవంబరు 9: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)కి రూ. 13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి లండన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు అప్పజెప్పనుంది. భారత ప్రభుత్వం లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేయడంతో లండన్‌ పోలీసులు అతణ్ని అరెస్టు చేసి, జైలుకు తరలించారు. తనను భారత్‌కు అప్పగించాలనే బ్రిటన్‌ ప్రభుత్వ చర్యలను నిలువరించాలని కోరుతూ నీరవ్‌ మోదీ రాయల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టి్‌సలో వ్యాజ్యం దాఖలు చేశారు. తన క్లైంట్‌ మానసిక స్థితి బాగోలేదని, అతని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, భారత్‌కు అప్పగించవద్దని నీరవ్‌మోదీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భారత ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ముంబైలోని ఆర్థర్‌రోడ్‌ జైలులో వైద్య సదుపాయాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలను నమోదు చేసుకున్న హైకోర్టు భారత్‌-బ్రిటన్‌ మధ్య నేరస్థుల అప్పగింతపై ఉన్న ఒప్పందాలను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. నీరవ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2022-11-10T05:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising