ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ooty Hill Train: పట్టాలపై విరిగిపడిన మట్టిచరియలు

ABN, First Publish Date - 2022-12-15T08:22:11+05:30

కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం- ఊటీ(Mettupalayam- Ooty) నడుమ నడిచే కొండరైలు సర్వీసు బుధవారం రద్దయింది. పట్టాలపై మట్టిపెళ్ళలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఊటీ కొండ రైలు రద్దు

చెన్నై, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం- ఊటీ(Mettupalayam- Ooty) నడుమ నడిచే కొండరైలు సర్వీసు బుధవారం రద్దయింది. పట్టాలపై మట్టిపెళ్ళలు, బండరాళ్లు విరిగి పడటంతో ఆ రైలు సర్వీసును రద్దు చేసినట్లు సేలం రైల్వే డివిజన్‌ అధికారులు ప్రకటించారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఉదయం ఊటీ కొండ రైలు బుధవారం ఉదయం మేట్టుపాళయం నుంచి బయలుదేరింది. ఆ రైలు కల్లార్‌ రైల్వేస్టేషన్‌ దాటగానే కల్లార్‌- హిల్‌గ్రోవ్‌ మధ్య పట్టాలపై మట్టిచరియలు, బండరాళ్లు పడి ఉండటాన్ని లోకోపైలట్‌ గమనించి రైలు నిలిపివేశారు. ఆ తర్వాత రైలును వెనక్కి నడుపుతూ మేట్టూపాళయం స్టేషన్‌కు చేర్చాడు. ప్రయాణికులకు టికెట్‌ సొమ్ము వాపసు చేశారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది మట్టిపెళ్లలు విరిగి పడిన ప్రాంతానికి వెళ్ళి మరమ్మతులు ప్రారంభించారు. దీంతో బుధవారం ఊటీ కొండ రైలు సర్వీసును రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అదే విధంగా ఊటీ నుంచి కూనూర్‌, మేట్టుపాళయం మార్గాల్లోనూ పలు రైళ్లను రద్దు చేశారు.

Updated Date - 2022-12-15T08:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising