ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pongal: 2 నుంచి ‘పొంగల్‌’ కానుక రూ.1000

ABN, First Publish Date - 2022-12-23T08:14:21+05:30

బియ్యం రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించింది. కార్డుదారులకు సంక్రాంతి(Sankranti)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రకటించిన సీఎం స్టాలిన్‌

- బియ్యం, చక్కెర కూడా పంపిణీ

చెన్నై, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బియ్యం రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించింది. కార్డుదారులకు సంక్రాంతి(Sankranti) సందర్భంగా రూ.1000 నగదు కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) గురువారం ప్రకటించారు. జనవరి 2 నుంచి రూ.1000 నగదుతోపాటు కిలో పచ్చిబియ్యం, కిలో చక్కెర ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బియ్యం రేషన్‌కార్డుదారులు, పునరావాస శిబిరాల్లో ఉన్న శ్రీలంక కుటుంబీకులకు కూడా ఈ నగదు కానుక, బియ్యం, చక్కెర పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సంక్రాంతి నగదు కానుక వల్ల ప్రభుత్వానికి రూ.2356 కోట్ల మేర భారం పడుతుందని వివరించారు. ఇదిలా వుండగా జనవరి రెండున నగరంలో కానుక పంపిణీని స్టాలిన్‌ ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని రేషన్‌షాపుల్లో పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంక్రాంతికి నగదు కానుక లేకుండా 16 రకాల సరకులు ఇచ్చింది. వాటిల్లో బెల్లం, మైదా, రవ్వ నాసిరకంగా ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. దీంతో మళ్లీ వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సాహసించలేదు. దానికి బదులుగా రూ.వెయ్యి నగదు, బియ్యం, చక్కెర మాత్రం ఇవ్వాలని నిర్ణయించింది.

Updated Date - 2022-12-23T08:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising