ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Potti Sriramulu: అమరజీవికి ప్రముఖుల నివాళి

ABN, First Publish Date - 2022-11-02T07:26:22+05:30

స్థానిక మైలాపూర్‌లో వున్న అమరజీవి పొట్టి శ్రీరాములు(Amarajeevi Potti Sriramulu) స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఘనంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం

చెన్నై, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక మైలాపూర్‌లో వున్న అమరజీవి పొట్టి శ్రీరాములు(Amarajeevi Potti Sriramulu) స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమరజీవి విగ్రహానికి కమిటీ చైర్మన్‌ కె.అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.కృష్ణారావు, కమిటీ సభ్యులు డాక్టర్‌ ఎంవీ నారాయణ గుప్తా, గుడిమెట్ల చెన్నయ్య, డాక్టర్‌ ఏవీ శివకుమారి, విశాఖపట్టణానికి చెందిన సమైక్య భారతి అధ్యక్షుడు పి.కన్నయ్య, గిడుగు రామమూర్తి మునిమనవడు గిడుగు వెంకటనాగేశ్వరరావు, అఖిలభారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్‌ సీఎంకే రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాయకర్‌ నందగోపాల్‌, నాగేంద్రన్‌, జనోదయం డైరెక్టర్‌ గొల్లపల్లి ఇస్రాయేలు, అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు జి. వేణుగోపాల్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా రాజా తదితరులు అంజలి ఘటించారు. కార్యక్రమంలో భాగంగా అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. 58 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి అసువులు బాసిన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణారావు మాట్లాడుతూ.. అమరజీవి త్యాగాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రజానీకం కూడా గుర్తించి ఆయన జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అమరజీవి స్మారక భవనం అభివృద్ధికి, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో తెలుగు భాష, సంస్కృతిని అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం తగినన్ని నిధులు సకాలంలో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-11-02T07:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising