Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటరాక్ట్ సర్జరీ
ABN, First Publish Date - 2022-11-20T16:27:57+05:30
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం కుడి కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఆర్మీ ఆసుపత్రిలో..
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆదివారం ఉదయం కుడి కంటికి క్యాటరాక్ట్ సర్జరీ (Cataract Surgery) చేయించుకున్నారు. ఆర్మీ ఆసుపత్రిలో (Referral and Research) కంటి శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము గత అక్టోబర్ 16న ఎడమ కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఏడాది జూలై 25న భారత 15వ రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణస్వీకారం చేశారు.
Updated Date - 2022-11-20T16:28:00+05:30 IST