ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cong presidnet Election: రాహుల్ ఓటుపై పార్టీ వివరణ

ABN, First Publish Date - 2022-10-16T22:22:56+05:30

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సోమవారంనాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల (Congress presidnet Election) పోలింగ్ సోమవారంనాడు జరుగనుంది. ఎన్నికల బరిలో సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా, భారత్ జోడో యాత్రలో ఉన్న సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) ఓటు హక్కు వినియోగంపై కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు వివరణ ఇచ్చింది. కర్ణాటకలోని బళ్లారిలో రాహుల్ ఓటు వేస్తారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌-చార్జి జైరామ్ రమేష్ ఓ ట్వీట్‌లో తెలిపారు.


''రాహుల్ గాంధీ ఎక్కడ ఓటు వేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకు తావులేదు. సంగనకల్లులో భారత్ జోడో యాత్రలో రాహుల్ పాల్గొంటున్నారు. బళ్లారిలోనే రాహుల్, 40  మంది పీసీసీ డెలిగేట్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు'' అని జైరామ్ రమేష్ ఆ ట్వీట్‌లో చెప్పారు.


పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేయనున్న సోనియా

కాగా, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని పార్టీ  ప్రధాన కార్యాలయంలో ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాల్లోనూ మొత్తం 67 బూత్‌లను సిద్ధం చేసినట్టు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ (సీఈఏ) తెలిపింది.


ముఖ్యాంశాలు..

-కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ జరుగుతుంది. సీక్రెట్ బ్యాలెట్ ఓట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

-అన్ని బ్యాలెట్ బాక్సులను ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి చేరుస్తారు. బ్యాలెట్ సీక్రెసీని కాపాడతామని కాంగ్రెస్ సీఈఏ చైర్మన్ మధుసూదన్  మిస్త్రీ ప్రకటించారు.

-ఏసీసీసీలో కూడా ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసినట్టు మిస్త్రీ తెలిపారు. ''ముఖ్యంగా సీనియర్ నేతలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, ఐడెంటిటీ కార్డు ఉండి ఢిల్లీలో ఉంటున్న వివిధ రాష్ట్రాలు వారు ఇక్కడ ఓటు వేయవచ్చు. ఢిల్లీలో ఓటు వేయాలని వారు కోరుకుంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాం. ఏఐసీసీలో కూడా వారు ఓటు వేయవచ్చు'' అని మిస్త్రీ చెప్పారు.

-ఓట్ల లెక్కింపు ఈనెల 19న జరుగుతుంది. కౌంటింగ్ పూర్తికాగానే ఫలితాలను ప్రకటిస్తారు.

-ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకూ స్టాండర్డ్ ప్రోటోకాల్ అమలులో ఉటుంది. పేపర్లపై నెంబరింగ్ ఉండదు. కౌంటర్ ఫాయిల్ ఎన్నికల అథారిటీ జాగ్రత్త చేస్తుంది. బ్యాలెట్ బాక్సులకు సీల్ వేయడం, సీల్ తీయడం ఎన్నికల ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది.

-కౌంటింగ్‌కు ముందు అన్ని రాష్ట్రాల బ్యాలెట్ పత్రాలను ఏకం (మిక్స్) చేస్తారు. ఇందువల్ల ఏ రాష్ట్రం నుంచి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఎవరికీ తెలియదు.

-137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇది ఆరోసారి అధ్యక్ష ఎన్నిక. 1939,1950,1977,1997, 2000లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.

-సుమారు 9,3000 మంది నాయకులు, కార్యకర్తలు (పీసీసీ డెలిగేట్స్) ఓటింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారు.

-కాంగ్రెసేతర అధ్యక్షుడు ఎన్నికకానుండటం గత 24 ఏళ్లలో ఇదే మొదటిసారి.

Updated Date - 2022-10-16T22:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising