రాహుల్ సద్దాం హుస్సేన్‌లా ఉన్నారు: హిమంత
ABN, First Publish Date - 2022-11-24T02:02:20+05:30
గడ్డంతో రాహుల్ గాంధీ అచ్చం ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత
అహ్మదాబాద్, నవంబరు 23: గడ్డంతో రాహుల్ గాంధీ అచ్చం ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అహ్మదాబాద్‌లోని ఓ సభలో ప్రసంగిస్తూ, రాహుల్ గాంధీ కొత్త రూపం పట్ల తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని, కానీ ఆయన భారతీయ నేతలైన వల్లభాయ్‌పటేల్, నెహ్రూ రూపాలను అనుకరిస్తే బాగుండేదని, గాంధీజీలాగ మారితే తాను ఇంకా సంతోషపడతానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడూ ఇతర దేశస్థుల సంస్కృతిని అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారని, వారికి స్వదేశీ సంస్కృతి పట్ల మమకారం లేదని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ గట్టిగా తిప్పికొట్టింది. బీజేపీ నాయకుల దృష్టి అవసరమైన విషయాలపై ఉండదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారిపట్టించేందుకు వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని ఆ పార్టీ నేత సందీప్ దీక్షిత్ విమర్శించారు. మోదీ గతంలో పొడవైన గడ్డంతో కనిపించినపుడు, తాము ఆయన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి బీజేపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
Updated Date - 2022-11-24T02:02:21+05:30 IST