ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ASEAN : ఆగ్నేయాసియా దేశాల సదస్సులో కీలక సమస్యను లేవనెత్తనున్న రాజ్‌నాథ్ సింగ్!

ABN, First Publish Date - 2022-11-12T17:14:52+05:30

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) త్వరలో ఆగ్నేయాసియా దేశాల నేతలను కలవబోతున్నారు. ఈ

Rajnath Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) త్వరలో ఆగ్నేయాసియా దేశాల నేతలను కలవబోతున్నారు. ఈ సందర్భంగా చైనా దురాక్రమణ విధానాలను ఎండగట్టడంతోపాటు మందుపాతరల తొలగింపు సమస్యపై కూడా చర్చిస్తారు. 1980వ దశకంలో యుద్ధాలు ముగిసినప్పటికీ, వివిధ దేశాల్లో ఏర్పాటు చేసిన మందుపాతరల వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు చాలా మంది గాయపడుతున్నారు. మైన్‌‌ఫీల్డ్స్ వల్ల కొన్ని దేశాల్లోని ఎక్కువ భాగం ప్రవేశానికి అవకాశం లేకుండా మిగిలిపోతోంది.

ఆగ్నేయాసియా దేశాల సంఘం (ASEAN) సమావేశాలు ఈ నెల 21 నుంచి నాలుగు రోజులపాటు జరుగుతాయి. మైన్‌ఫీల్డ్స్, చెదురుమదురుగా ఉండే మందుపాతరల వల్ల చాలా దేశాల్లో అనేక మంది మరణిస్తుండటం, గాయపడుతుండటం జరుగుతోంది. ముఖ్యంగా కాంబోడియా, లావోస్, వియత్నాం వంటి దేశాలు వీటివల్ల ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ మందుపాతరలను తొలగించేందుకు భారతీయ సిబ్బందిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం గురించి ఇప్పటికే కొన్ని ఆసియాన్ దేశాలు భారత దేశంతో చర్చలు జరిపాయి. డీమైనింగ్ కార్యకలాపాల నిర్వహణకు తగిన సత్తా భారత దేశానికి ఉండటంతోపాటు, ఇతర దేశాలకు సహకరించే విషయంలో కూడా ఆసక్తి చూపుతోంది.

కాంబోడియాలో అంతర్యుద్ధం 1980వ దశకం చివర్లో ముగిసింది. కానీ యుద్ధం సమయంలో పెట్టిన యాంటీ పర్సనల్ మైన్స్ ఇప్పటికీ ఉన్నాయి. వాటి మీద కాలు మోపినవారు ప్రాణాలను కోల్పోవడం కానీ, శరీర అవయవాలను కోల్పోవడం కానీ జరుగుతోంది. వియత్నాంలో యుద్ధాలు 1950వ దశకంలో ప్రారంభమయ్యాయి. 1979-80లో చైనా దాడిని తిప్పికొట్టే వరకు కొనసాగాయి. అంతకుముందు ఫ్రెంచ్, అమెరికాలతో యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధం లావోస్‌కు కూడా విస్తరించింది.

ఇప్పటికే పాశ్చాత్య దేశాల సంస్థలు డీమైనింగ్ ఆపరేషన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నాయి. చౌక ధరకు ఈ కార్యకలాపాలను నిర్వహించగలమనే నమ్మకం భారత దేశానికి ఉంది. రాజ్‌నాథ్ సింగ్ పర్యటనలో ఈ అంశం చర్చకు వస్తుందని తెలుస్తోంది.

చైనా దురాక్రమణ వైఖరి వల్ల ఇబ్బందులు పడుతున్నామనే భావన ఆసియాన్ దేశాలకు ఉంది. ఇప్పటికే ఫిలిప్పైన్స్, మరికొన్ని దేశాలకు మన దేశం బ్రహ్మోస్ మిసైల్‌ను విక్రయించింది. ఈ నేపథ్యంలో రక్షణ సంబంధాలు మరింత బలోపేతమవడానికి ఈ పర్యటన దోహదపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.

Updated Date - 2022-11-12T17:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising