వణికిస్తున్న చలి.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
ABN, First Publish Date - 2022-11-13T11:41:30+05:30
వాయుగుండ ప్రభావంతో చలి రాష్ట్రాన్ని వణికిస్తోంది. బెంగళూరు(Bengaluru)తో పాటు పలు ప్రాంతాల్లో శనివారం తుంపర వర్షం కురిసింది. ఈదురుగా
- పలుచోట్ల చిరు జల్లులు
బెంగళూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వాయుగుండ ప్రభావంతో చలి రాష్ట్రాన్ని వణికిస్తోంది. బెంగళూరు(Bengaluru)తో పాటు పలు ప్రాంతాల్లో శనివారం తుంపర వర్షం కురిసింది. ఈదురుగాలుల ప్రభావంతో నగరంలో మధ్యాహ్నం అయినా చలి కొనసాగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 20 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కొండలు, పర్వతాల తరహా వాతావరణం నగరంలో కనిపించింది. గడిచిన రెండు రోజులుగా చిక్కమగళూరు(Chikkamagaluru)లో 13.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రంలోని 83 శాతం భౌగోళిక ప్రదేశంలో కనిష్టంగా 14 నుంచి గరిష్టంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బెళగావి, హాసన్, తుమకూరు, చిక్కబళ్లాపుర, బాగల్కోటె, హాసన్, కలబురగి, ఉత్తరకన్నడ, ధారవాడ, కొప్పళ, కొడగు, శివమొగ్గ జిల్లాలో 12 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణకన్నడ జిల్లాలో మాత్రం 30-34 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగింది. బెంగళూరులోని పలు వార్డుల్లో 19 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో బెంగళూరు అత్యంత శీతల ప్రాంతంగా మారింది.

Updated Date - 2022-11-13T11:42:41+05:30 IST