ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sonali Phogat case చార్జిషీటు నమోదు చేసిన సీబీఐ

ABN, First Publish Date - 2022-11-22T15:08:54+05:30

బీజేపీ నాయకురాలు, రియాల్టీ షో 'బిగ్‌బాస్' కంటెస్టెంట్ సోనాలి ఫోగట్ గోవా పర్యటన సమయంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు, రియాల్టీ షో 'బిగ్‌బాస్' కంటెస్టెంట్ సోనాలి ఫోగట్ (Sonali Phogat case) గోవా (Goa) పర్యటన సమయంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో సీబీఐ (CBI) తొలి చార్జిషీటు (Chargesheet) దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుధీర్ సాగ్వాన్, సుఖ్విందర్ సింగ్‌ పేర్లను చార్జిషీటులో చేర్చింది. గత ఆగస్టు 23న అంజునలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఫోగట్‌ను తీసుకువచ్చారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆమెకు హానికరమైన డ్రగ్ నీటిలో కలిపి బలవంతంగా ఇచ్చినట్టు పోలీసుల అభియోగంగా ఉంది. ఘటన జరగడానికి ముందు రోజే తన పీఏలు సుధీర్ సాంగ్వాన్, సుఖ్వీందర్ సింగ్‌లతో కలిసి ఆమె గోవా వచ్చారు.

ఈ కేసుకు సంబంధించి సుధీర్ సాగ్వాన్, సుఖ్విందర్ సింగ్‌‌ సహా ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తొలుత ఈ కేసు విచారణను గోవా పోలీసులు చేపట్టగా, అనంతరం సీబీఐకి అప్పగించారు. అంజునా బీచ్‌లోని కర్లీస్ రెస్టారెంట్‌లో ఆమె చేత బలవంతంగా మెథాంఫేటమిన్ డ్రగ్స్‌ను నిందితులు తాగించినట్టు గోవా పోలీసులు కనుగొన్నారు. సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్, నిందితుల విచారణ ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారు. డబ్బు కోసమే ఆమెను హత్య చేశారని, వాళ్లను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో కేసును సీబీఐకి బదిలీ చేశారు.

Updated Date - 2022-11-22T17:44:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising