ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవభారతానికి ఉన్నతంగా ఆలోచించండి

ABN, First Publish Date - 2022-11-15T02:12:54+05:30

దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 133వ జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ముర్ము..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెహ్రూ జయంతి సందర్భంగా బాలలకు రాష్ట్రపతి ఉద్బోధ తొలి ప్రధానికి మోదీ, కాంగ్రెస్‌ నాయకుల నివాళి

న్యూఢి ల్లీ, నవంబరు 14: దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 133వ జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ముర్ము.. నెహ్రూ సేవలను కొనియాడారు. బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో తనను కలిసిన వివిధ పాఠ శాలల విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు, నవభారతం కోసం ఉన్నతంగా ఆలోచించాలని ఆమె విద్యార్థులకు సూచించారు. నెహ్రూకు ప్రఽధాని మోదీ నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలో నెహ్రూ సమాధి శాంతివనం వద్ద కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ పుష్పాంజలి ఘటించారు.

దేశ హితం కోసం నెహ్రూ పనిచేయలేదు: కిర ణ్‌ రిజిజు

నెహ్రూ దేశ హితం కోసం పనిచేయలేదని కేంద్ర న్యాయమంత్రి కిరణ్‌ రిజిజు విమర్శించారు. నెహ్రూ మిగతా స్వతంత్ర ప్రతిపత్తి రాజ్యాలతో వ్యవహరించిన రీతిలో కశ్మీర్‌తో వ్యవహరించలేదని ఆయన స్నేహితుడైన షేక్‌ అబ్దుల్లాను రక్షించే విధంగా వ్యవహరించారన్నారు. నెహ్రూ తప్పుడు నిర్ణయాల వల్లే నేటికీ కశ్మీర్‌లో రక్తపాతం జరుగుతోందని అన్నారు. రిజిజు వ్యాఖ్యలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్దీ్‌పసింగ్‌ పూరి సమర్థించారు. హరిసింగ్‌ తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ముందుకొచ్చినప్పటికీ నెహ్రూ వెనకడుగు వేశారని అన్నారు. వీరిరువురి వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. నెహ్రూను, గాంధీని విమర్శించనిదే బీజేపీకి రోజు గడవదని ఆ పార్టీ నేత నాసిర్‌ హుస్సేన్‌ అన్నారు. బీజేపీ అగ్రనాయకుల తప్పులను కప్పిపుచ్చేందుకు వారు పదేపదే నెహ్రూను విమర్శిస్తుంటారని అన్నారు. నెహ్రూ ఏనాడూ తన వ్యక్తిగత ఎజెండా కోసం పనిచేయలేదని, ఆయన కృషి వల్లే దేశంలో మౌలిక సౌకర్యాలు మెరుగయ్యాయని, ఐఐటీలు, ఐఐఎమ్‌లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-11-15T02:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising