ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Union Minister Rijiju : కొలీజియం వల్లే ఖాళీలు

ABN, First Publish Date - 2022-12-16T01:20:23+05:30

న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం నడుమ మాటల యుద్ధం మరింత ముదిరింది. సుప్రీంకోర్టు కొలీజియం విధానంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్జిల నియామక విధానం మారాల్సిందే..

భిన్నత్వం, వైవిధ్యానికి అనుగుణంగా జరగాలి: కేంద్ర మంత్రి రిజిజు

కొలీజియం వ్యవస్థ విస్తృతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌జేఏసీ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది సరైనది కాదని విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు.

5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం చర్యలు తీసుకుంటున్నా.. జడ్జిల భర్తీలో ప్రభుత్వ పాత్ర చాలా పరిమితంగా ఉంది.

- కేంద్ర న్యాయ మంత్రి రిజిజు

న్యూఢిల్లీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం నడుమ మాటల యుద్ధం మరింత ముదిరింది. సుప్రీంకోర్టు కొలీజియం విధానంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు మళ్లీ విమర్శలు ఎక్కుపెట్టారు. న్యాయమూర్తుల నియామక విధానం మారనంత కాలం అత్యున్నత న్యాయ వ్యవస్థలో అత్యధిక ఖాళీలు తప్పవని తేల్చిచెప్పారు. గురువారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ శుక్లా, పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. హైకోర్టు జడ్జీలుగా నియామకానికి కొలీజియం ప్రతిపాదించిన 20 పేర్లను మరోసారి పరిశీలించమని తిప్పి పంపినట్లు తెలిపారు. 1,108 మంజూరైన న్యాయమూర్తుల పోస్టులకు గాను ఈ నెల 9వ తేదీ వరకు 25 వేర్వేరు హైకోర్టుల్లో 777 మంది పనిచేస్తున్నట్లు వివరించారు. 331 ఖాళీలున్నాయన్నారు. 147 ఖాళీలకు హైకోర్టుల నుంచి స్వీకరించిన ప్రతిపానదలు సుప్రీం కోర్టు కొలీజియం, కేంద్ర ప్రభుత్వం మధ్య వివిధ దశల్లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 184 ఖాళీలపై హైకోర్టుల నుంచి ఇంకా ప్రతిపాదనలు అందాల్సి ఉందన్నారు. మరోవైపు రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వ హక్కు అని రిజిజు పేర్కొన్నారు. న్యాయస్థానాలను సంప్రదించి గతంలో వారి నియామకాలు జరిగేవని.. 1993 తర్వాత ఈ పరిస్థితి మారిందని తెలిపారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని పునరుద్ధరించే ఆలోచన ఉందా అని అడగ్గా.. సూటిగా జవాబివ్వలేదు. లోక్‌సభ, రాజ్యసభ రెండూ కలిసి ఎన్‌జేఏసీ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాయని గుర్తుచేశారు. ఆ తర్వాత మూడింట రెండోవంతు రాష్ట్రాలు కూడా ఆమోదించాయన్నారు. కొలీజియం వ్యవస్థ విస్తృతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా చేసేందుకు 2014లో కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌జేఏసీ చట్టాన్ని సుప్రీంకోర్టు 2015లో కొట్టివేసిందన్నారు.

ఇది సరైనది కాదని పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు, న్యాయవాదులు, పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. సుప్రీంలో 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. 27 మంది పనిచేస్తున్నారని, ఏడు ఖాళీలున్నాయని తెలిపారు. దేశంలో 5 కోట్ల పెండింగ్‌ కేసులు ఉన్నాయని, ఇది చాలా బాధాకరమని, దీని ప్రభావం సామాన్యులపై ఎంత ఉంటుందో ఊహించవచ్చని పేర్కొన్నారు. న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండడం కూడా పెండింగ్‌కు కారణమని, దానిని తగ్గించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నా జడ్జిల భర్తీలో ప్రభుత్వ పాత్ర చాలా పరిమితంగా ఉందని తెలిపారు. ‘న్యాయమూర్తులను కొలీజియం ఎంపిక చేస్తోంది. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి హక్కూ లేదు. ఖాళీల భర్తీకి న్యాయమూర్తులను వేగంగా సిఫారసు చేయాల్సిందిగా సీజేఐ, హైకోర్టు సీజేలకు తరచూ నివేదిస్తున్నాం. లేఖలు రాస్తున్నాం. ఈ నియామకాలు అత్యంత నాణ్యతతో ఉండాలని, దేశ భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాతినిధ్యం వహించేలా ఉండాలని కోరుతున్నాం. ముఖ్యంగా మహిళలకు తగు ప్రాతినిధ్యం ఉండాలని చెబుతున్నాం. కానీ పార్లమెంటు, ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా మనం ఎందుకో పనిచేయడం లేదని అనుకుంటున్నాం. అయితే, దీనిపై నేను ఎక్కువ మాట్లాడదలచుకోలేదు. మాట్లాడితే న్యాయవ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లుగా ఉంటుంది’ అని రిజిజు వ్యాఖ్యానించారు. ప్రస్తుత వ్యవస్థ స్థానంలో కొత్తది ఏర్పడేదాకా న్యాయమూర్తుల ఖాళీల సమస్య వస్తూనే ఉంటుందన్నారు.

చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు మంచిదే

లోక్‌సభకు, అసెంబ్లీలకు వేర్వేరుగా తరచూ ఎన్నికల నిర్వహణకు భారీ వ్యయమవుతోందని.. వాటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని కేంద్ర మంత్రి రిజిజు చెప్పారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు హర్‌నాథ్‌సింగ్‌ యాదవ్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. పాలనలో సుస్థిరత సాధించేందుకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల చట్టాల్లో సంస్కరణలపై ఇచ్చిన నివేదికలో లా కమిషన్‌ సూచించిందన్నారు. ప్రజాధనం భారీగా ఆదా అవుతుందని, పరిపాలన, శాంతిభద్రతల యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో పదేపదే పాల్గొనాల్సిన అవసరం ఉండదని తెలిపారు. పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల ప్రచార వ్యయం కూడా ఆదా అవుతుందన్నారు. పలుసార్లు ఎన్నికల వల్ల దీర్ఘకాలం పాటు నిబంధనావళిని పాటించాల్సి వస్తోందని.. దీనివల్ల ప్రభుత్వ పథకాల అమలు దెబ్బతింటోందని తెలిపారు. 1951-52, 57, 62, 67 సంవత్సరాల్లో జమిలి ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. చట్టసభల సభ్యులు మరో పార్టీలోకి ఫిరాయిస్తే అనర్హత వేటు వేసేందుకు ఏర్పరచిన రాజ్యాంగంలోని పదో షెడ్యూలుకు ప్రస్తుతం సవరణలు చేయాల్సిన అవసరం కనపడడం లేదని రిజిజు చెప్పారు.

Updated Date - 2022-12-16T01:20:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising