ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vande Bharath: వందేభారత్‌ రైలులో పెరిగిన ప్రయాణికుల రద్దీ

ABN, First Publish Date - 2022-11-16T10:33:55+05:30

చెన్నై - మైసూరు(Chennai - Mysore) నగరాల మధ్య ఈ నెల 11న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన వందేభారత్‌ రైలులో ప్రయాణీకుల రద్దీ రోజురోజుకూ పె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): చెన్నై - మైసూరు(Chennai - Mysore) నగరాల మధ్య ఈ నెల 11న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన వందేభారత్‌ రైలులో ప్రయాణీకుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. గంటకు 160 కి.మీల వేగంతో నడిచే సామర్థ్యం కలిగిన ఈ రైలును ప్రస్తుతం గంటకు 110 కి.మీల వేగంతో నడుపుతున్నారు. అత్యంత ఆధునిక సదుపాయాలు కూడా ఉండటంతో ఈ రైలులో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ రైలులో ప్రయాణికులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, బిస్కెట్లు, టీ, కాఫీ కూడా అందిస్తున్నారు. ఈ రైలులో మొత్తం 1280 మంది ప్రయాణించేందుకు సీట్లున్నాయి. ప్రస్తుతం సుమారు 1000 సీట్లకు టికెట్లు అమ్ముడవుతున్నాయని రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. బెంగళూరు, మైసూరు నగరాలకు విహారయాత్రగా వెళ్ళాలనుకునేవారు కూడా వందేభారత్‌(Vande Bharat) రైలులో అధికంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ కొత్త రైలు సర్వీసుకు నాలుగు రోజుల్లోనే ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం సంతోషదాయకంగా ఉందన్నారు.

Updated Date - 2022-11-16T10:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising