ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Veeramani: గవర్నర్‌ వైఖరి మార్చుకోవాలి

ABN, First Publish Date - 2022-12-02T08:37:08+05:30

రాష్ట్రప్రభుత్వాన్ని కట్టడి చేసేలా వ్యవహరించడం మానుకోకుంటే, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి నల్లజెండాలతో నిరసన తెలియజేస్తామని ద్రావిడర్‌ కళగం అధ్యక్షుడు కె.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- లేకుంటే నల్లజెండాలతో నిరసన

- ద్రావిడర్‌ కళగం అధ్యక్షుడు వీరమణి హెచ్చరిక

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 1: రాష్ట్రప్రభుత్వాన్ని కట్టడి చేసేలా వ్యవహరించడం మానుకోకుంటే, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి నల్లజెండాలతో నిరసన తెలియజేస్తామని ద్రావిడర్‌ కళగం అధ్యక్షుడు కె. వీరమణి(K. Veeramani) హెచ్చరించారు. ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆమోదించిన బిల్లు అనుమతించకుండా కాలయాపన చేస్తున్న గవర్నర్‌ తీరును ఖండిస్తూ స్థానిక సైదాపేటలో ద్రావిడర్‌ కళగం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వీరమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(BJP President Annamalai), ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామితో భేటీ అయ్యేందుకు సమయం కేటాయిస్తున్న గవర్నర్‌, న్యాయశాఖ మంత్రికి మాత్రం అపాయింట్‌ ఇవ్వడానికి ఎందుకింత జాప్యం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం ఆమోదించే ప్రజా సంక్షేమ బిల్లులను సకాలంలో పరిశీలించి అనుమతివ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రథమపౌరుడిదేనని, గవర్నర్‌ తన వైఖరి మార్చుకోకుంటే ఆయన వెళ్లే అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ తరఫున నల్లజెండాలతో నిరసన తెలియజేస్తామని వీరమణి హెచ్చరించారు.

Updated Date - 2022-12-02T08:37:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising