షాహి ఈద్గాలో హనుమాన్ చాలీసా పఠిస్తాం: హిందూ మహాసభ
ABN, First Publish Date - 2022-11-27T19:09:25+05:30
సుమారు 30 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన చోటుచేసుకున్న డిసెంబర్ 6న మధురలోని షాహి ఊద్గాలో హనుమాన్ చాలీసా పారాయణం చేయనున్నట్టు అఖిల భరత్ హిందూ మహాసభ..
మధుర: సుమారు 30 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన చోటుచేసుకున్న డిసెంబర్ 6న మధురలోని షాహి ఊద్గాలో (Shahi Edgah) హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పారాయణం చేయనున్నట్టు అఖిల్ భారత్ హిందూ మహాసభ (Akhil Bharat Hindu Mahasabha) జాతీయ అధ్యక్షురాలు రాజ్యశ్రీ చౌదరి తెలిపారు. తాము చాలా దృఢమైన నిర్ణయం తీసుకున్నామని, హిందూ మహాసభ ఆధ్వర్యంలో సనాతన ధర్మ పునరుద్ధరణకు కంకణబద్ధులై ఉన్నామని చెప్పారు. షాహి దర్గా ఆవరణను పవిత్రం చేసేందుకు, కృష్ణ భగవానుని జన్మస్థలమైన ఆ ప్రాంతాన్ని హిందూ సమాజానికి అప్పగించేందుకు హనుమాన్ చాలీసా పారాయణం చేయనున్నట్టు ఆమె తెలిపారు. గత ఏడాది కూడా హనుమాన్ చాలీసా పారాయణానికి తాము సిద్ధపడినప్పటికీ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించి, పలు అవరోధాలు కల్పించిందని ఆమె చెప్పారు. ఆ కారణంగానే తాము మధుర నుంచి ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ వద్ద జలాభిషేకం చేశామని తెలిపారు.
''వాస్తవం ఏమిటంటే కాంప్లెక్స్ స్థలం మొత్తాన్ని బ్రిటిష్ హయాంలో జరిగిన వేలంలో మన తాతముత్తాతలు (హిందువులు) కొనుగోలు చేశారు. రెండో వర్గం (ముస్లింలు) వారు అప్పుడు ఇక్కడ లేనేలేరు'' అని చౌదరి అన్నారు. కాగా, ఈద్గాలో ప్రవేశించేందుకు రాజశ్రీ చౌదరి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ పోలీసు అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.
Updated Date - 2022-11-27T19:09:27+05:30 IST