ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asaduddin Owaisi: రైలులో ప్రయాణిస్తున్న ఎంపీ అసదుద్దీన్‌పై రాళ్లతో దాడి

ABN, First Publish Date - 2022-11-08T06:27:59+05:30

గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీపై రాళ్ల దాడి జరిగిందా? అంటే అవునంటున్నారు ఆ పార్టీ ...

Asaduddin Owaisi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూరత్(గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీపై రాళ్ల దాడి జరిగిందా? అంటే అవునంటున్నారు ఆ పార్టీ నాయకుడు వారిస్ పఠాన్. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్ నుంచి సూరత్(Surat) నగరానికి వందేభారత్ రైలులో(Vande Bharat coach) ప్రయాణిస్తున్న అసదుద్దీన్ ఒవైసీపై(Asaduddin Owaisi) ఆగంతకులు రాళ్లతో దాడి చేశారని(Stones thrown) మజ్లిస్ నాయకుడు వారిస్ పఠాన్(AIMIM's Waris Pathan) ఆరోపించారు. వందేభారత్ రైలు సూరత్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో నడుస్తుండగా అసదుద్దీన్ కూర్చున్న బోగీపై ఆగంతకులు రాళ్లు విసిరారని వారిస్ పఠాన్ సూరత్ ర్యాలీలో ఆరోపించారు. ‘‘నేను అసదుద్దీన్ పక్కన కూర్చొని రైలులో ప్రయాణిస్తుండగా రాయి దాడికి రైలు అద్దం పగిలింది, మరో నిమిషంలో మరో రాయి అసద్ ప్రయాణిస్తున్న రైలు బోగీపై ఆగంతకులు విసిరారు’’ అని వారిస్ పఠాన్ చెప్పారు. తమపై రాళ్ల వర్షం కురిపించినా, అగ్ని వర్షం కురిపించినా తాము మాత్రం హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటామని వారిస్ పఠాన్ చెప్పారు.

Updated Date - 2022-11-08T06:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising