Chaddi Row: మీ చెడ్డీలు మీకే పంపుతాం.. బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్
ABN, First Publish Date - 2022-06-12T21:50:58+05:30
చెడ్డీల వివాదం కర్ణాటకలో ఇంకా తగ్గుముఖం పట్టలేదు. బీజేపీ పంపే అని చెడ్డీలను తాము సేకరించి..
బెంగళూరు: చెడ్డీల వివాదం (Chaddi row) కర్ణాటకలో ఇంకా తగ్గుముఖం పట్టలేదు. బీజేపీ పంపే అని చెడ్డీలను తాము సేకరించి.. వాటిని గంపగుత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపుతామని కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే ఆదివారంనాడు తెలిపారు. చెడ్డీలు సేకరించి కాంగ్రెస్ విపక్ష నేపత సిద్ధరామయ్య నివాసానికి పంపించాలంటూ బీజేపీ ఇటీవల సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టడటంతో కాంగ్రెస్ తాజా వ్యాఖ్యలు చేసింది.
చెడ్డీల వివాదం ఇలా...
పాఠ్యాంశాల రివిజన్‌కు వ్యతిరేకంగా ఇటీవల ఎన్‌ఎస్‌యూఐ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీఎస్ నగేష్ నివాసం వెలుపల ఖాకీ చొక్కాలను విద్యార్థి విభాగం దగ్దం చేసింది. దీంతో 15 మంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఇందుకు ప్రతిప్రక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధరించే ఖాళీ నిక్కర్లను తగులబెట్టాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతిగా బీఎస్‌పీ ఎస్‌సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చలవాడ నారాయణ స్వామి స్పందిస్తూ, తాను స్యయంగా పార్టీ ఆఫీస్ బేరర్లతో కలిసి సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి ఖాకీ చెడ్డీలు అందజేస్తానని వ్యాఖ్యానించారు. ఆ వెనువెంటనే మైసూరు, చిక్కమగళూరు జిల్లాల నుంచి బీజీపే, ఆర్ఎస్ఎస్ వర్కర్లు పెద్దఎత్తున చెడ్డీలు సేకరించి కాంగ్రెస్ కార్యాలయానికి, సిద్ధరామయ్యకు పంపారు. ఇందుకు తాజాగా కాంగ్రెస్ స్పందిస్తూ.. మీ చెడ్డీలు మీకే పంపుతామంటూ హెచ్చరించింది.
''ఆర్ఎస్ఎస్ చెడ్డీలను ఎన్ఎస్‌యూఐ సభ్యులు దగ్ధం చేశారు. దీనిపై బీజేపీ ఆగ్రహం చెందాల్సిన అవసరం ఏముంది? వాడేసిన చెడ్డీలను సేకరించి కేపీసీసీ కార్యాలయానికి బీజేపీ పంపుతోంది. బీజేపీకి మేము చెప్పదలచుకున్నది ఒక్కటే. మీరు ఎన్ని పంపాలనుకుంటే అన్ని పంపండి. వాటన్నింటినీ కేపీసీసీ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపుతాం. మీ చెడ్డీలు మీకే ఇస్తాం'' అని ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప స్పందిస్తూ, సిద్ధరామయ్య గౌరవప్రదంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఆర్ఎస్ఎస్ గురించి, చెడ్డీల గురించి మాట్లాడుతూ పోతే ఆయన గౌరవం పోగొట్టుకుంటారని అన్నారు.
Updated Date - 2022-06-12T21:50:58+05:30 IST