Super Star Krishna: 50 ఏళ్ల నటజీవితం.. రెండే రెండు అవార్డులు!

ABN, First Publish Date - 2022-11-16T04:43:36+05:30

యాభై ఏళ్ల సినీ జీవితంలో హీరో కృష్ణకు ప్రభుత్వ పరంగా లభించినవి రెండే అవార్డులు అంటే వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ అది నిజం!

Super Star Krishna: 50 ఏళ్ల నటజీవితం.. రెండే రెండు అవార్డులు!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాభై ఏళ్ల సినీ జీవితంలో హీరో కృష్ణకు ప్రభుత్వ పరంగా లభించినవి రెండే అవార్డులు అంటే వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ అది నిజం! అయితే వాటి గురించి కృష్ణ ఎప్పుడూ పట్టించుకోలేదు. ‘ప్రజాభిమానం ఉంది కదా.. అది చాలు’ అనేవారు. కృష్ణ నటించిన చిత్రాలకు జాతీయ, నంది అవార్డులు వచ్చాయిగానీ.. హీరోగా వ్యక్తిగత కోటాలో ఏ అవార్డూ ఆయనకు రాలేదు. 1976లో కృష్ణకు లభించిన తొలి బిరుదు ‘నటశేఖర’. ఢిల్లీలోని తెలుగు ఫిల్మ్‌ సొసైటీ కృష్ణ చలన చిత్రోత్సవాన్ని నిర్వహించి, ఆయనకు ఈ బిరుదు ప్రదానం చేసింది. అలాగే ‘ఆంధ్రజ్యోతి’కి చెందిన ‘జ్యోతిచిత్ర’ వారపత్రిక తెలుగు ప్రజల్లో సినీ తారలకు ఉన్న ఆదరణను అంచనా వేయడానికి నిర్వహించిన తొలి ఫిల్మ్‌ బ్యాలెట్‌లో ఎన్టీఆర్‌ సూపర్‌స్టార్‌గా ఎన్నికయ్యారు. రెండో సంవత్సరం ఆ స్థానం హీరో కృష్ణకు దక్కింది. ఆ తర్వాత వరుసగా ఐదేళ్ల పాటు సూపర్‌స్టార్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు కృష్ణ. అలాగే 2007లో ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డుని కృష్ణ స్వీకరించారు. 2009లో కేంద్రప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారం పొందారు. అలాగే ఆంధ్ర వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు.

Updated Date - 2022-11-16T10:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising