ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవార్డు పాట.. స్పెషల్‌ ఆట

ABN, First Publish Date - 2022-11-16T04:37:36+05:30

పాటల పరంగా కృష్ణ ఖాతాలో రికార్డు కాని రికార్డు ఇది! తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు వచ్చింది .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాటల పరంగా కృష్ణ ఖాతాలో రికార్డు కాని రికార్డు ఇది! తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు వచ్చింది కృష్ణ పిక్చర్‌కే! అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ‘తెలుగువీర లేవరా.. దీఽక్షబూని సాగరా’ పాటకు జాతీయ అవార్డు వరించింది. ఈ పాటను శ్రీశ్రీ రాశారు. ఆ తర్వాత మరో రెండు పాటలకు ‘జాతీయ’ గుర్తింపు దక్కింది. అందులో మాతృదేవోభవ చిత్రం కోసం వేటూరి రాసిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటకు.. ఠాగూర్‌ చిత్రం కోసం నేను ‘సైతం ప్రపంచానికి సమిధనొక్కటి’ అన్న శ్రీశీ చరణతో సుద్దాల అశోక్‌ తేజ రాసిన పాటకు జాతీయ పురస్కారాలు లభించాయి. ఇక పాటల పరంగా ఎవరికీ దక్కని ‘ప్రత్యేక ఆదరణ’ కృష్ణకు లభించిందనే చెప్పొచ్చు. అవే.. ‘స్పెషల్‌ సాంగ్స్‌’! కొన్ని చిత్రాల్లో ఆయన ప్రత్యేక గీతాలు చేశారు. వాటిలో యమలీలలో ‘జుంబారే జుజుంబరే’ పాట, ‘పంచవన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా’ పాటలు ఆదరణ పొందాయి.

నేను అక్షరం రాసినా దానికి కూడా విలువకట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ! సినీ ఫీల్డ్‌లో నా మీద ప్రత్యేకాభిమానం వున్న అనేకులలో ముఖ్యడుగా నట శేఖర కృష్ణను ఆత్మీయుడిగా పరిగణిస్తాను. అతని నటన గురించి చెప్పాలంటే ‘అల్లూరి సీతారామారాజు’ పాత్రనతడు పోషించిన విధానాన్ని దేశమంతా మెచ్చుకుంది. అందుచేత ప్రత్యేకించి ఈ విషయమై నేను పొగడక్కర లేదు.

- శ్రీశ్రీ

Updated Date - 2022-11-16T04:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising