పాలతో ధమాకా
ABN, First Publish Date - 2022-10-29T01:11:40+05:30
పాలతో చేసిన తీపి పదార్థాలను తిన్నప్పుడే ‘మధురం’ అనే మాటకు అసలైన అర్థం తెలుస్తుంది. స్వీట్స్‌ను ఏ పండగకో చేసుకోవాలనే నియమమేం లేదు. ఖాళీ సమయాల్లో కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలు తీపి వంటకాలను మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రస్ మాధురి కావాల్సిన పదార్థాలు ఆవు పాలు- 2 లీటర్లు, చక్కెర- 300 గ్రాములు, నీళ్లు- లీటరున్నర, పిస్తా పౌడర్- 2 టీస్పూన్లు, కుంకుమ పువ్వు- కొద్దిగా, ఫుల్ క్రీమ్ మిల్క్- లీటరు, ఆల్మండ్స్- 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు- 1 టేబుల్ స్పూన్, పిస్తా పలుకులు- 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి- పావు టీస్పూన్, కెవ్‌రా వాటర్- అర టీస్పూన్, కుంకుడు కాయలు- 2 తయారీ విధానం మొదట కుంకుడు కాయల విత్తనాలు తీసి ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇందులో వేడి నీళ్లను పోసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండు లీటర్ల ఆవుపాలను మరగబెట్టి జున్ను తయారు చేసుకోవాలి. జున్నులో నీళ్లు లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. మరో ప్యాన్‌లో చక్కెరతో పాటు నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద పెట్టి ఐదు నిముషాలు ఉంచాలి. ఆ తర్వాత కుంకుడు కాయలు నానబెట్టిన నీళ్లను రెండు స్పూన్లు తీసి అందులో వేయాలి. పది నిముషాలు హై ఫ్లేమ్‌లో ఉంచాలి. ఈ లోపు జున్నును ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న కప్పు తీసుకుని అందులో పిస్తా పౌడర్, కుంకుమ పువ్వు తీసుకోవాలి. ఒక పెద్ద జున్ను ఉండను తీసుకుని ఆ మిశ్రమం అద్ది మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ చిన్న ఉండలను స్టఫ్‌లా జున్ను ఉండల మధ్యభాగంలో గుంతలా చేసి ఆ తర్వాత చుట్టూ కప్పేసినట్లు ఒత్తుకోవాలి. ఈ ఉండలను చక్కెర నీళ్లలో మెల్లగా ఒక్కోటి అన్నీ వేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టి ఐదు నిముషాలకోసారి చూస్తూంటే.. రసగుల్లలు లావు అవుతాయి. దీంతో పాటు నీళ్లు తగ్గిపోతుంటాయి. చివరగా చిక్కని చక్కెర పానకం అడుగుకి రసగుల్లలు చేరుకుంటాయి. ఆ తర్వాత వీటిని చల్లబర్చాలి. ఆ తర్వాత మరో ప్యాన్‌లో కొన్ని నీళ్లు పోసి, ఫుల్ క్రీమ్ పాలతో పాటు తగినంత చక్కెర పోయాలి. గరిటెతో మెల్లగా కదుపుతూ మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. కొద్ది సేపయ్యాక బాదం, జీడిపప్పులు ఒక్కో స్పూన్ చొప్పున వేయాలి. కాస్త పిస్తా వేయాలి. చిక్కగా అయ్యేట్లు మరగబెట్టాలి. వీలుంటే ఇలాచి పౌడర్ వేసుకోవాలి. స్పూన్ కేవ్‌రా వాటర్ వేయాలి. పాలు సగం కంటే తక్కువ అయ్యాక స్టవ్ ఆపేయాలి. ఈ లోపు రసగుల్లలను ఒక పెద్ద బౌల్‌లో ఉంచుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలతో చేసిన మిశ్రమాన్ని అందులో పోయాలి. ఉండలమీద పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. చల్లబడ్డాక ఈ రస్‌మాధురి తింటే ఆ రుచే వేరు. బ్రెడ్ మలై శాండ్ విచ్ కావాల్సిన పదార్థాలు పాలు- 2 లీటర్లు, మిల్క్ బ్రెడ్ -3 పీస్‌లు, చక్కెర- 300 గ్రాములు, కుంకుమ పువ్వు- గ్రాము, యాలకుల పొడి- 10 గ్రాములు, పిస్తా- 50 గ్రాములు, కస్టర్డ్ పౌడర్- 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన ఆల్మండ్స్- టేబుల్ స్పూన్, షుగర్ పౌడర్- టేబుల్ స్పూన్, మిల్క్ పౌడర్- టేబుల్ స్పూన్, మలై- టేబుల్ స్పూన్, తయారీ విధానం బ్రెడ్‌ను ట్రయాంగిల్ ఆకారంలో కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది పక్కనబెట్టుకుని ఒక ప్యాన్‌లో పాలు పోసి గరిటెతో కలుపుతూ ఉండాలి. చక్కెర వేసి బాగా మరగబెట్టాలి. ఇందులోకి యాలకుల పొడి వేయాలి. బాగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ లోపు చిన్న బౌల్‌లో కొన్ని పాలు పోసి కస్టర్డ్ పౌడర్ బాగా కలపాలి. దీన్ని ప్యాన్‌లోని పాలలో వేయాలి. కలుపుతూ మధ్యలో ఆల్మండ్స్ వేయాలి. క్రీమ్‌లా తయారైన పాలను బౌల్‌లో పోసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇంకో బౌల్‌లో షుగర్ పౌడర్, మిల్క్ పౌడర్, మలై వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ క్రీమ్‌ను బ్రెడ్ మీద పూసి మరో ముక్కతో మూసేయాలి. ఈ బ్రెడ్ శాండ్ విచ్‌లను ఒక ప్లేట్‌లో ఉంచి దానిపై చల్లబడిన పాల మిశ్రమాన్ని వేసుకోవాలి. గార్నిష్ కోసం పిస్తా పలుకులు, కట్ చేసిన బాదం పలుకులు వేసుకుని తినొచ్చు. మఖానా ఖీర్ కావాల్సిన పదార్థాలు మఖానా- 200 గ్రాములు, చక్కెర- 300 గ్రాములు, పాలు- లీటరు, నెయ్యి- 200 గ్రాములు, యాలకుల పొడి- 10 గ్రాములు, జీడిపప్పు- 100 గ్రాములు, ఎండు ద్రాక్ష- 50 గ్రాములు, కుంకుమ పువ్వు- గ్రాము తయారీ విధానం ఒక ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి మఖానాను రోస్ట్ చేసుకోవాలి. దీని వల్ల కాస్త ఉబ్బినట్లు అవ్వటమే కాకుండా నెయ్యితో ఘుమఘుమలాడుతుంటాయి. ఆ తర్వాత మరో ప్యాన్‌లో పాలు పోసి బాగా మరగబెట్టాలి. ఆ తర్వాత చక్కెర వేయాలి. గరిటెతో పాలు కలుపుతూంటే పొంగు వస్తుంది. దీన్ని సగం అయ్యేంత వరకూ మరగబెట్టాలి. ఆ తర్వాత మఖానాతో పాటు యాలకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేయాలి. బాగా కలియబెట్టాలి. పాలలో ఉడికి మఖానా మెత్తపడుతుంది. ఆ తర్వాత పొయ్యి మీదనుంచి దింపి.. చల్లబడిన తర్వాత ‘మఖానా ఖీర్’ తినాలి. ఖజూర్ డ్రైఫ్రూట్ రోల్ కావాల్సిన పదార్థాలు ఖర్జూరం- 500 గ్రాములు, జీడిపప్పు- 100 గ్రాములు, బాదం- 50 గ్రాములు, పిస్తా- 510 గ్రాములు, నెయ్యి- 100 గ్రాములు, చక్కెర -200 గ్రాములు, యాలకుల పొడి- 10 గ్రాములు, గసగసాలు- 100 గ్రాములు తయారీ విధానం ఖర్జూరాల్లోని విత్తనాలను తీసి సన్నగా కట్ చేసుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పులను కూడా సన్నగా తరగాలి. ఇక ఒక ప్యాన్ తీసుకుని గసగసాలు, పిస్తా పలుకులు వేయాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. గోల్డెన్ కలర్‌లోకి మారిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్‌లో మిగతా డ్రైఫ్రూట్స్‌ను వేయాలి. కాస్త నెయ్యి వేసి తక్కువ మంట మీద వేయించాలి. దాన్ని మరో ప్లేట్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్‌లో నెయ్యి వేసి అందులోకి ఖర్జూర పండ్ల మిశ్రమాన్ని వేయాలి. గరిటతో కదుపుతూంటే ఖర్జూర మిశ్రమం మెత్తగా అవుతుంది. ఆ తర్వాత ముందు పక్కన ఉంచిన డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని వేయాలి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేయాలి. మిశ్రమాన్ని ఒత్తుతూ కలియబెట్టాలి. ఈ ముద్దను ప్లేట్‌లో వేసి చల్లబర్చాలి. ఆ తర్వాత రోల్‌లా చేసుకోవాలి. ప్లేట్‌లో ఉంచిన గసగసాలు, పిస్తా పలుకులను అంటేట్లు చేసుకోవాలి. ఆ రోల్‌ను ఒక పేపర్‌లో చివరలు కూడా క్లోజ్ చేసి చాక్లెట్‌లా చుట్టేయాలి. ఆ తర్వాత ఫ్రీజర్‌లో ఉంచాలి. గంట సమయం తర్వాత రోల్‌ను బిస్కెట్స్‌లా కట్ చేసుకోవాలి. బనానా హల్వా కావాల్సిన పదార్థాలు అరటిపండ్లు- 6, నెయ్యి- 200 గ్రాములు, బెల్లం- అరకేజీ, జీడిపప్పు పలుకులు- 100 గ్రాములు, పిస్తా- 50 గ్రాములు, ఇలాచి- 10 గ్రాములు తయారీ విధానం మొదట అరటి పండ్లను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఒక ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి పోసి స్టవ్ ఆన్ చేయాలి. ఆ తర్వాత వెంటనే మిక్సీ పట్టిన అరటి మిశ్రమం వేయాలి. గరిటెతో బాగా కలియబెట్టాలి. పది నిమిషాల తర్వాత రంగు మారుతుంది. ఆ తర్వాత మరో ప్యాన్‌లో బ్లెలం వేసి సరిపడ నీళ్లు పోయాలి. మెల్లగా బెల్లం నీటిలో కరిగిపోతుంది. మెల్లగా గరిటెతో కలియబెడుతుండాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఆ మిశ్రమాన్ని అరటి మిశ్రమంలో పోసి బాగా కలియబెడుతుండాలి. మంటను తగ్గించి కలియబెడుతూనే ఒక స్పూన్ నెయ్యి పోసి కంటిన్యూ్‌సగా గరిటెతో కలియబెడుతుండాలి. ఇలా చేయడం వల్ల నెయ్యి అంతా మిశ్రమంలో కలిసిపోతుంది. ఆ తర్వాత మరోసారి స్పూన్ నెయ్యివేయాలి. మళ్లీ కలియబెట్టాలి. ఆ తర్వాత ప్యాన్‌కి అంటకుండా ఉండేట్లు మిశ్రమం తయారవుతుంది. ఆ వెంటనే యాలకుల పొడి, బాదం, పిస్తా, జీడిపప్పు వేయాలి. చల్లారిన తర్వాత బనానా హల్వా భలే ఉంటుంది. వీలయితే ఒక చతురస్రాకార సిల్వర్ ట్రేలో ఉంచి లెవల్ చేసి రెండు గంటల తర్వాత స్వీట్స్‌లా కట్ చేసుకుని తినొచ్చు కూడా.
పాలతో చేసిన తీపి పదార్థాలను తిన్నప్పుడే ‘మధురం’ అనే మాటకు అసలైన అర్థం తెలుస్తుంది. స్వీట్స్‌ను ఏ పండగకో చేసుకోవాలనే నియమమేం లేదు. ఖాళీ సమయాల్లో కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలు తీపి వంటకాలను మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
రస్‌మాధురి
కావాల్సిన పదార్థాలు
ఆవు పాలు- 2 లీటర్లు, చక్కెర- 300 గ్రాములు, నీళ్లు- లీటరున్నర, పిస్తా పౌడర్- 2 టీస్పూన్లు, కుంకుమ పువ్వు- కొద్దిగా, ఫుల్ క్రీమ్ మిల్క్- లీటరు, ఆల్మండ్స్- 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు- 1 టేబుల్ స్పూన్, పిస్తా పలుకులు- 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి- పావు టీస్పూన్, కెవ్‌రా వాటర్- అర టీస్పూన్, కుంకుడు కాయలు- 2
తయారీ విధానం
మొదట కుంకుడు కాయల విత్తనాలు తీసి ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇందులో వేడి నీళ్లను పోసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండు లీటర్ల ఆవుపాలను మరగబెట్టి జున్ను తయారు చేసుకోవాలి. జున్నులో నీళ్లు లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. మరో ప్యాన్‌లో చక్కెరతో పాటు నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద పెట్టి ఐదు నిముషాలు ఉంచాలి. ఆ తర్వాత కుంకుడు కాయలు నానబెట్టిన నీళ్లను రెండు స్పూన్లు తీసి అందులో వేయాలి. పది నిముషాలు హై ఫ్లేమ్‌లో ఉంచాలి.
ఈ లోపు జున్నును ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న కప్పు తీసుకుని అందులో పిస్తా పౌడర్, కుంకుమ పువ్వు తీసుకోవాలి. ఒక పెద్ద జున్ను ఉండను తీసుకుని ఆ మిశ్రమం అద్ది మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ చిన్న ఉండలను స్టఫ్‌లా జున్ను ఉండల మధ్యభాగంలో గుంతలా చేసి ఆ తర్వాత చుట్టూ కప్పేసినట్లు ఒత్తుకోవాలి. ఈ ఉండలను చక్కెర నీళ్లలో మెల్లగా ఒక్కోటి అన్నీ వేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టి ఐదు నిముషాలకోసారి చూస్తూంటే.. రసగుల్లలు లావు అవుతాయి. దీంతో పాటు నీళ్లు తగ్గిపోతుంటాయి. చివరగా చిక్కని చక్కెర పానకం అడుగుకి రసగుల్లలు చేరుకుంటాయి. ఆ తర్వాత వీటిని చల్లబర్చాలి.
ఆ తర్వాత మరో ప్యాన్‌లో కొన్ని నీళ్లు పోసి, ఫుల్ క్రీమ్ పాలతో పాటు తగినంత చక్కెర పోయాలి. గరిటెతో మెల్లగా కదుపుతూ మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. కొద్ది సేపయ్యాక బాదం, జీడిపప్పులు ఒక్కో స్పూన్ చొప్పున వేయాలి. కాస్త పిస్తా వేయాలి. చిక్కగా అయ్యేట్లు మరగబెట్టాలి. వీలుంటే ఇలాచి పౌడర్ వేసుకోవాలి. స్పూన్ కేవ్‌రా వాటర్ వేయాలి. పాలు సగం కంటే తక్కువ అయ్యాక స్టవ్ ఆపేయాలి. ఈ లోపు రసగుల్లలను ఒక పెద్ద బౌల్‌లో ఉంచుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలతో చేసిన మిశ్రమాన్ని అందులో పోయాలి. ఉండలమీద పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. చల్లబడ్డాక ఈ రస్‌మాధురి తింటే ఆ రుచే వేరు.
బ్రెడ్ మలై శాండ్ విచ్
కావాల్సిన పదార్థాలు
పాలు- 2 లీటర్లు, మిల్క్ బ్రెడ్ -3 పీస్‌లు, చక్కెర- 300 గ్రాములు, కుంకుమ పువ్వు- గ్రాము, యాలకుల పొడి- 10 గ్రాములు, పిస్తా- 50 గ్రాములు, కస్టర్డ్ పౌడర్- 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన ఆల్మండ్స్- టేబుల్ స్పూన్, షుగర్ పౌడర్- టేబుల్ స్పూన్, మిల్క్ పౌడర్- టేబుల్ స్పూన్, మలై- టేబుల్ స్పూన్,
తయారీ విధానం
బ్రెడ్‌ను ట్రయాంగిల్ ఆకారంలో కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది పక్కనబెట్టుకుని ఒక ప్యాన్‌లో పాలు పోసి గరిటెతో కలుపుతూ ఉండాలి. చక్కెర వేసి బాగా మరగబెట్టాలి. ఇందులోకి యాలకుల పొడి వేయాలి. బాగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ లోపు చిన్న బౌల్‌లో కొన్ని పాలు పోసి కస్టర్డ్ పౌడర్ బాగా కలపాలి. దీన్ని ప్యాన్‌లోని పాలలో వేయాలి. కలుపుతూ మధ్యలో ఆల్మండ్స్ వేయాలి. క్రీమ్‌లా తయారైన పాలను బౌల్‌లో పోసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇంకో బౌల్‌లో షుగర్ పౌడర్, మిల్క్ పౌడర్, మలై వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ క్రీమ్‌ను బ్రెడ్ మీద పూసి మరో ముక్కతో మూసేయాలి. ఈ బ్రెడ్ శాండ్ విచ్‌లను ఒక ప్లేట్‌లో ఉంచి దానిపై చల్లబడిన పాల మిశ్రమాన్ని వేసుకోవాలి. గార్నిష్ కోసం పిస్తా పలుకులు, కట్ చేసిన బాదం పలుకులు వేసుకుని తినొచ్చు.
మఖానా ఖీర్
కావాల్సిన పదార్థాలు
మఖానా- 200 గ్రాములు, చక్కెర- 300 గ్రాములు, పాలు- లీటరు, నెయ్యి- 200 గ్రాములు, యాలకుల పొడి- 10 గ్రాములు, జీడిపప్పు- 100 గ్రాములు, ఎండు ద్రాక్ష- 50 గ్రాములు, కుంకుమ పువ్వు- గ్రాము
తయారీ విధానం
ఒక ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి మఖానాను రోస్ట్ చేసుకోవాలి. దీని వల్ల కాస్త ఉబ్బినట్లు అవ్వటమే కాకుండా నెయ్యితో ఘుమఘుమలాడుతుంటాయి. ఆ తర్వాత మరో ప్యాన్‌లో పాలు పోసి బాగా మరగబెట్టాలి. ఆ తర్వాత చక్కెర వేయాలి. గరిటెతో పాలు కలుపుతూంటే పొంగు వస్తుంది. దీన్ని సగం అయ్యేంత వరకూ మరగబెట్టాలి. ఆ తర్వాత మఖానాతో పాటు యాలకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేయాలి. బాగా కలియబెట్టాలి. పాలలో ఉడికి మఖానా మెత్తపడుతుంది. ఆ తర్వాత పొయ్యి మీదనుంచి దింపి.. చల్లబడిన తర్వాత ‘మఖానా ఖీర్’తినాలి.
ఖజూర్ డ్రైఫ్రూట్ రోల్
కావాల్సిన పదార్థాలు
ఖర్జూరం- 500 గ్రాములు, జీడిపప్పు- 100 గ్రాములు, బాదం- 50 గ్రాములు, పిస్తా- 510 గ్రాములు, నెయ్యి- 100 గ్రాములు, చక్కెర -200 గ్రాములు, యాలకుల పొడి- 10 గ్రాములు, గసగసాలు- 100 గ్రాములు
తయారీ విధానం
ఖర్జూరాల్లోని విత్తనాలను తీసి సన్నగా కట్ చేసుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పులను కూడా సన్నగా తరగాలి. ఇక ఒక ప్యాన్ తీసుకుని గసగసాలు, పిస్తా పలుకులు వేయాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. గోల్డెన్ కలర్‌లోకి మారిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్‌లో మిగతా డ్రైఫ్రూట్స్‌ను వేయాలి. కాస్త నెయ్యి వేసి తక్కువ మంట మీద వేయించాలి. దాన్ని మరో ప్లేట్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్‌లో నెయ్యి వేసి అందులోకి ఖర్జూర పండ్ల మిశ్రమాన్ని వేయాలి.
గరిటతో కదుపుతూంటే ఖర్జూర మిశ్రమం మెత్తగా అవుతుంది. ఆ తర్వాత ముందు పక్కన ఉంచిన డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని వేయాలి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేయాలి. మిశ్రమాన్ని ఒత్తుతూ కలియబెట్టాలి. ఈ ముద్దను ప్లేట్‌లో వేసి చల్లబర్చాలి. ఆ తర్వాత రోల్‌లా చేసుకోవాలి. ప్లేట్‌లో ఉంచిన గసగసాలు, పిస్తా పలుకులను అంటేట్లు చేసుకోవాలి. ఆ రోల్‌ను ఒక పేపర్‌లో చివరలు కూడా క్లోజ్ చేసి చాక్లెట్‌లా చుట్టేయాలి. ఆ తర్వాత ఫ్రీజర్‌లో ఉంచాలి. గంట సమయం తర్వాత రోల్‌ను బిస్కెట్స్‌లా కట్ చేసుకోవాలి.
బనానా హల్వా
కావాల్సిన పదార్థాలు
అరటిపండ్లు- 6, నెయ్యి- 200 గ్రాములు, బెల్లం- అరకేజీ, జీడిపప్పు పలుకులు- 100 గ్రాములు, పిస్తా- 50 గ్రాములు, ఇలాచి- 10 గ్రాములు
తయారీ విధానం
మొదట అరటి పండ్లను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఒక ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి పోసి స్టవ్ ఆన్ చేయాలి. ఆ తర్వాత వెంటనే మిక్సీ పట్టిన అరటి మిశ్రమం వేయాలి. గరిటెతో బాగా కలియబెట్టాలి. పది నిమిషాల తర్వాత రంగు మారుతుంది. ఆ తర్వాత మరో ప్యాన్‌లో బ్లెలం వేసి సరిపడ నీళ్లు పోయాలి. మెల్లగా బెల్లం నీటిలో కరిగిపోతుంది. మెల్లగా గరిటెతో కలియబెడుతుండాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఆ మిశ్రమాన్ని అరటి మిశ్రమంలో పోసి బాగా కలియబెడుతుండాలి. మంటను తగ్గించి కలియబెడుతూనే ఒక స్పూన్ నెయ్యి పోసి కంటిన్యూ్‌సగా గరిటెతో కలియబెడుతుండాలి.
ఇలా చేయడం వల్ల నెయ్యి అంతా మిశ్రమంలో కలిసిపోతుంది. ఆ తర్వాత మరోసారి స్పూన్ నెయ్యివేయాలి. మళ్లీ కలియబెట్టాలి. ఆ తర్వాత ప్యాన్‌కి అంటకుండా ఉండేట్లు మిశ్రమం తయారవుతుంది. ఆ వెంటనే యాలకుల పొడి, బాదం, పిస్తా, జీడిపప్పు వేయాలి. చల్లారిన తర్వాత బనానా హల్వా భలే ఉంటుంది. వీలయితే ఒక చతురస్రాకార సిల్వర్ ట్రేలో ఉంచి లెవల్ చేసి రెండు గంటల తర్వాత స్వీట్స్‌లా కట్ చేసుకుని తినొచ్చు కూడా.
Updated Date - 2022-10-29T01:12:14+05:30 IST