negative thoughts : ప్రతికూల ఆలోచనలా..? ఈ ఐదు మార్గాలను ట్రై చేయండి.
ABN, First Publish Date - 2022-10-31T10:30:49+05:30
కాగ్నిటివ్ ట్రయాంగిల్ పద్దతి మన ఆలోచనలను, మన భావాలను ఎలా ప్రభావితం చేస్తాయని చెపుతుంది.
ఆలోచనలు మనలో ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. ఇవి ప్రతికూలమైనవా లేక అనుకూలమైనవా అనేది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కాగ్నిటివ్ ట్రయాంగిల్ పద్దతి మన ఆలోచనలను, మన భావాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది చెపుతుంది. మనిషి శారీరక మానసిక శ్రేయస్సును ప్రభావితం చేసేవి ఆలోచనలే.
పోల్చుకోవద్దు..
మనలో చాలామందికి మనల్ని మనం విమర్శించుకోవడం లేదా ఇతరులను విమర్శించడం అలవాటు ఉంటుంది. ఇతరులతో నిరంతరం పోల్చుకోవడం, చిన్నకారణాలకే ద్వేషించడం వంటి అలవాట్లు నెగిటివ్ ఆలోచనలే.. ఇలాంటప్పుడు పాజిటివ్ ధోరణిలో ఆలోచించడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం, ఇది మీ గురించి మీరు తెలుసుకునేలా చేస్తుంది. ఈ ధోరణి జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని తీసుకువస్తుంది.
సులువైన మాటల్లో చెప్పాలంటే.. మానసిక ఆరోగ్యం బావుండాలంటే భవిష్యత్ గురించి ఆలోచించే అలవాటును వదులుకోవాలి. లేదంటే ఈ ఆలోచన ఆందోళనను పెంచుతుంది. అటువంటి సమయంలో భవిష్యత్ గురించి తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉండకపోవచ్చు. సరైన జీవన శైలితో ప్రతికూల ఆలోచనలను మనమే నియంత్రించుకోగలం.
లక్ష్యాలు
1. ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్యాలు ఉంటాయి. అనుకున్న లక్ష్యాలను సాధించడం కోసం కష్టపడాలి. దీనికోసం తగిన వర్క్ చేసినట్లయితే అసంపూర్ణ భావాన్ని పోగొట్టుకోవచ్చు.
2. జీవితంలోని లక్ష్యాల సాధనలో మానసిక ఉల్లాసం కూడా అవసరం.
3. పొద్దున్నే నడవడం, సమతుల్యత , స్థిరత్వాన్ని తిరిగి పొందడానికి ప్రతిరోజూ 30 నిమిషాలు ధ్యానం చేయడం అలవాటుగా చేసుకోవాలి.
4. మన ఆలోచనా విధానాన్ని నిర్దేశించే శక్తి మనలో లేనప్పటికీ ఆలోచనా విధానాన్ని మార్చుకునే వీలుంది.
5. నిద్రపోయే ముందు గడిచిన రోజును గురించి అందులో జరిగిన మంచి చెడుల గురించి ఆలోచించుకోవడం కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది
Updated Date - 2022-10-31T10:36:57+05:30 IST